తెలుగు రాష్ట్రాలను అకాల వర్షాలు మొదలయ్యాయి.. ఈ సమయంలో ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది.

భారీ వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.. దోమల భారి నుంచి రక్షణ కోసం దోమతెరలు ఏర్పాటు చేసుకోవాలి

వేడిగా ఉండే  ఆహార పదార్థాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు 

వర్షాలు పడ్డపుడు జలుబు, దగ్గు చిన్న పాటి జ్వరం వస్తూ ఉంటాయి. ప్రతిరోజూ  బాగా కాచి వడపోసిన నీటిని తాగుతూ ఉండాలి.

 వర్షాకాలంలో ఎట్టి పరిస్థితుల్లో  కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ లాంటివి తీసుకొవద్దు.. జలుబు, జ్వరం వచ్చే ప్రమాదం ఉంటుంది. 

వర్షంలో ఎక్కువగా తడిస్తే..  ఆరోగ్యం కూడా దెబ్బ తినే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఇంట్లో ఎప్పటికప్పుడు డెటాల్ తో తుడుచుకోవాలి.  పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి

వర్షపు నీరు ఇంటి చుట్టుపక్కల నిల్వ ఉంటే వాటిని వెంటనే తొలిగించాలి. దోమలు, ఈగలు ఇంట్లోకి రాకుండా జాగ్రత్త పడాలి

వర్షాలు వచ్చినపుడు చిన్న పిల్లలు ఎక్కువగా నీటిలో ఉండటానికి ప్రయత్నిస్తుంటారు.. వారి విషయంలో జాగ్రత్తలు అవసరం

 ఎవరైనా వైరల్ ఫీవర్ లేదా డెంగ్యూ, మలేరియా లేదా జలుబుతో బాధపడుతుంటే వారికి పిల్లలను దూరంగా ఉంచాలి.

వర్షాలు పడ్డపుడు పిల్లలకు ఎక్కువగా జలుబు, విరేచనాలు, చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయి.. వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి

వర్షాలు ఎక్కువగా పడితే.. పిల్లలకు ఫ్లూ, వైరల్ ఫీవర్, డయేరియా వంటికి వస్తాయి.. ఇంట్లో ఆహారం కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

పిల్లలకు పాలు, పండ్లు,గుడ్లు, నట్స్ వంటి మంచి పోషకాలతో కూడిన ఆహారం అందించాలి.