మతృత్వం అనేది పెళ్లైన ప్రతీ స్త్రీ కోరుకుంటుంది. మెుదటిసారి గర్భం దాల్చడం ఎంతో మధురమైన అనుభూతి.

అయితే చాలా మంది స్త్రీలు తొలిసారి గర్భం దాల్చడంతో ఎక్కువగా మానసిక ఒత్తిడికి, ఆందోలళనకు గురౌతుంటారు.

దాంతో తల్లీ బిడ్డా ఆరోగ్యానికి ప్రమాదం అంటున్నారు వైద్యనిపుణులు.

అందుకే తొలిసారి ప్రెగ్నెన్సీ వచ్చిన వారు అస్సలు ఈ పనులు చేయకూడదు అని నిపుణులు చెబుతున్నారు.

ఫస్ట్ టైమ్ ప్రెగ్నెన్సీ అయిన వారు తొలి మూడు నెలలు ట్రైన్, బైక్ ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచింది.

అనారోగ్యకరమైన అలవాట్ల వల్ల ఈ సమయంలో బరువు పెరుగుతారు.

దాంతో మీకు గర్భధారణ టైమ్ లో షుగర్, అధిక రక్తపోటు లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

అందుకే ప్రగ్నెన్సీ టైమ్ లో ఎక్కువగా ద్రవ పదార్థాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉప్పు, నూనె పదార్థాలను తగ్గించండి.

ఇక ప్రతిరోజు కచ్చితంగా 8 గంటలు నిద్రపోవాలి. ఎడమ చేతివైపు తిరిగి పడుకోవడం మంచిది. 

ఇలా పడుకోవడం ద్వారా తల్లి నుంచి శిశువుకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

ప్రగ్నెన్సీ సమయంలో ఫాస్ట్ గా నడవరాదు. బరువులు ఎత్తడంతో పాటుగా.. ఎక్కువ వంగకూడదు అని వైద్యులు సూచిస్తున్నారు.

నోట్: పైన తెలిపిన చిట్కాలు పాటించేముందు మీ దగ్గర్లోని డాక్టర్ల, నిపుణుల సలహాలు తీసుకోండి.