ఈ రోజుల్లో చాలా మంది హైబీపీ సమస్యతో బాధపడుతున్నారు.
ఫలితంగా గుండె సంబంధిత వ్యాధులు, మెదడులోని రక్తనాళాల్లో ఇబ్బందులు, కిడ్నీ సమస్యలు వంటి సమస్యలతో చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
హైబీపీ సమస్యతో పక్షవాతం వంటి రోగాలతో మంచానికే పరిమితమవుతున్నారు.
ఈ హైబీపీ సమస్యతో దేశవ్యాప్తంగా రోజుకు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.
ఇదిలా ఉంటే.. హూబీపీ సమస్యతో పాటు లోబీపీ సమస్యతో బాధపడేవారు సైతం చాలా మందే ఉన్నారు.
అసలు లోబీపీ వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటి? సేఫ్ జోన్ లో ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
మీరు లోబీపీతో బాధపడుతుంటే మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకండి అంటూ వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఏ పని చేయకముందే అలసి పోయినట్టు ఉండడం. తక్కువ బీపీ ఉంటే మూర్చ సమస్య రావచ్చు.
బీపీ తక్కువగా ఉండడం తక్కవ రక్తపోటుకు సంకేతంగా చెప్పవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే లోబీపీ సమస్యగా పరిగణించవచ్చు.
లోబీపీ సమస్య రాకుండా ఉండాలంటే నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.
లోబీపీ సమస్యతో బాధపడేవారు గ్లాసు నీటిలో అర టీ స్పూన్ ఉప్పు వేసుకుని తాగాలి.
బీపీ తక్కువగా ఉన్న సమయంలో ఎలక్ట్రోలైట్ ద్రావణాన్ని తాగవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.
మీకు ఇలాంటి లోబీపీ లక్షణాలు ఉంటే మాత్రం వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు.
NOTE: ఇది కేవలం మీకు అవగాహన కోసమే. పూర్తి సలహాలు, సూచనల కోసం వైద్యుడిని సంప్రదించండి