హెచ్3ఎన్2 ఇన్ ఫ్లుఎంజా వైరస్ దేశవ్యాప్తంగా వ్యాపిస్తోంది.

ఈ వైరస్ సీజనల్ గా వచ్చేదే అయినప్పటికీ పిల్లలు, వృద్ధులపై తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉంది.

ఈ ఇన్ ఫ్లుఎంజా పదేళ్లలోపు చిన్నారులు, ముసలివాళ్లు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారిపై ప్రభావం ఉంటుంది.

హర్యాణా, కర్ణాటకలో ఈ వైరస్ వల్ల రెండు మరణాలు సంభవించినట్లు కేంద్రం వెల్లడించింది.

జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు ఈ వైరస్ లో ఉంటాయని తెలిపారు.

ఈ వైరస్ లక్షణాల మొత్తం నార్మల్ ట్రీట్మెంట్ ద్వారానే తగ్గిపోతుందని చెబుతున్నారు.

తెలంగాణలో ఇప్పటివరకు అడ్మిట్ చేసుకోవాల్సిన అవసరం రాలేదని వైద్యశాఖ తెలిపింది.

ఓపీల ద్వారానే చికిత్స అందిస్తుందని.. ఇప్పటికే నీలోఫర్ ఆస్పత్రిని అధునాతనంగా సిద్ధం చేశామన్నారు.

ఈ వైరస్ వల్ల జలుబు నుంచి నిమోనియాలా మారితే మాత్రం ప్రమాదమంటున్నారు.

విశాఖలో కూడా ఈ వైరస్ ప్రభావం కనిపిస్తోంది.. ఇప్పటికే 12 హెచ్3ఎన్2 కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలున్న పిల్లలను పాఠశాలలకు పంపకండని విద్యాశాఖ కోరింది.

పిల్లల నుంచి ఈ వైరస్ ఇంటి వద్ద ఉన్న ముసలివాళ్లు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి సోకుతుందని హెచ్చరిస్తున్నారు.

వైరస్ సోకకుండా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటింస్తే వైరస్ బారిన పడకుండా ఉంటారని తెలిపారు.

ముందస్తు జాగ్రత్తలతోనే ఈ హెచ్3ఎన్2 వైరస్ ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉంటుందని సూచించారు.