కూరగాయల్లో దుంప జాతికి చెందినవి అనేకం ఉన్నాయి. వాటిల్లో ఒకటి బీట్ రూట్

బీట్ రూట్ కూర అనగానే.. ఇంట్లో వాక్ అనే పదం వినిపిస్తూనే ఉంది. ఎర్రగా ఉండీ.. భయాన్ని గొల్పిస్తుంది.

బీట్ రూట్ తినేందుకు ఇష్టపడరు. అయితే ఇందులో ఎన్నో పోషక విలువలున్నాయి. 

అందం, ఆరోగ్యాన్ని ఇస్తాయని చెబుతున్నారు పోషకాహార నిపుణులు

బీట్​రూట్​తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. వీటిని తినడం వల్ల శరీరంలోని రక్తం శాతం పెరుగుతుంది.

దీన్ని వంటగా చేసుకుని తినలేని వారూ.. జ్యూస్ చేసుకొని తాగాలని సూచిస్తున్నారు.

అధిక రక్తపోటు దరిచేయనియ్యదు. అదేవిధంగా ఊబకాయం కూడా తగ్గుతుందట

బీట్​రూట్​కు ఎరుపు రంగును కలిగించే బీటా సయానిన్‌కు పెద్దపేగుల్లో క్యాన్సర్‎తో పోరాడే లక్షణం ఉంది.

ఇందులో ఉండే నైట్రేట్లు, నైట్రిక్ ఆక్సైడ్.. అధిక రక్తపోటును తగ్గించడంలో ఉపయోగపడతాయి. 

ఇవి రక్త సరఫరాలో ఉండే అడ్డంకులను తొలగిస్తాయి.

బీట్ రూట్ వల్ల మధుమేహం మటుమాయమవుతుందట. కాలేయ సంబంధింత సమస్యలు తలెత్తవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు

సీజనల్ వ్యాధులు, చర్మ సంబంధిత రోగాలను తట్టుకునేలా చేస్తుంది బీట్ రూట్. 

కంటి చూపును మెరుగుపరుస్తుంది. అవయవాలన్నింటికీ ఆక్సిజన్ సరిగ్గా అందించడంలో ఈ దుంప తోడ్పడుతుంది.

బీట్​రూట్​లో నైట్రేట్​తో పాటు విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు అధికంగా ఉంటాయి.  

బీట్ రూట్ తినడం వల్ల ఐరన్ సమకూరి రక్త హీనత తగ్గుతుంది. హోమోగ్లోబిన్ పర్సంటేజ్  కావాలనుకునే వారికి ఇది మంచి ఆహారం.

బీట్ రూట్ తినడం వల్ల వృద్దాప్య చాయలు రానియ్యదు. అలాగే గుజ్జుగా చేసుకుని ఎండ బెట్టి పొడుచేసుకుని సౌందర్య సాధనంగా కూడా వినియోగించవచ్చు.