ఘాటైన రుచి, వాసన కలిగి ఉండే మిరియాలకు సుగంధ ద్రవ్యాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి.
వంటల్లో విరి విరిగా ఉపయోగించే ఈ మిరియాలను క్వీన్ ఆఫ్ స్పైసెస్ గా సంభోదిస్తుంటారు.
అయితే చాలా మందికి నల్ల మిరియాల గురించే తెలుసు.
కానీ, మిరియాల్లోనే తెల్ల మిరియాలూ కూడా ఉంటాయి.
ఇవి కూడా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. మరి.. ఆవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
తెల్ల మిరియాల్లో కాల్షియం, పొటాషియం, సోడియం, జింక్, ఐరన్, విటమిన్ ఎ, బి, కె,ఇ, వంటివి ఉన్నాయి.
అలానే తెల్ల మిరియాల్లో ఫైబర్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ నిండి ఉంటాయి.
ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో పావు స్పూన్ తెల్ల మిరియాల పొడి కలిపి తీసుకుంటే ఒత్తిడి సమస్య తగ్గుతుంది.
జలుబు, దగ్గు, గొంతు నొప్పి, కఫం సమస్యలతో ఇబ్బంది పడే వారు కూడా ఈ మిరియాలను ఉపయోగిస్తే మంచిది.
పాలలో కలుపుకుని తెల్లమిరియాలను తీసుకుంటే రోగ నిరోధక శక్తి బలపడుతుంది.
తెల్ల మిరియాలలో క్యాప్సైసిన్ కంటెంట్ ఉంటుంది
తెల్ల మిరియాలు శరీరంలోని క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో సహాయపడుతుంది.
తెల్ల మిరియాల పొడిని వంటలలో, సలాడ్స్‌లో, సూప్స్‌లో కలిపి తీసుకుంటే మంచిది.
ఇక తెల్ల మిరియాలను తీసుకోవడం వల్ల రక్త పోటు అదుపులో ఉంటుంది.
గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది.కీళ్ల నొప్పులు దూరం అవుతాయి.
తెల్ల మిరియాలను ఉపయోగించి చర్మ అలర్జీలు, మొటిమ సమస్యలు తగ్గించుకోవచ్చు.
నోట్: పై చిట్కాలు పాటించే ముందు దగ్గర్లోని డాక్టర్ల, నిపుణుల సలహాలను తీసుకోండి.