వెండి పట్టీలు పెట్టుకున్న వారికి కాళ్ల నొప్పులు, తిమ్మిరి, వణుకు వంటి సమస్యలు తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
వెండికి నొప్పులను తగ్గించే గుణం ఉంటుంది. ఇది సానుకూలతను పెంచుతుంది.
హార్మోన్ల హెచ్చుతగ్గుల కారణంగా కొంతమంది స్త్రీలు జననేంద్రియ, గర్భాశయ సమస్యలతో బాధపడుతుంటారు.
అయితే వెండి ఆభరణాలు చర్మానికి తగలడం వల్ల హార్మోన్ల సమతుల్యంగా ఉంటాయి. నెలసరి కూడా ఇర్రెగ్యులర్ గా అయ్యే అవకాశం ఉండదు.
ఊబకాయం సమస్యను తగ్గించడంలో వెండి ఎంతగానో సహాయపడుతుంది.
పాదాలు, మడమ వాపు సమస్య వల్ల మడమ నొప్పిగా ఉంటుంది. వెండి పట్టీలు ధరిస్తే ఈ నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
వెండి పట్టీలు పెట్టుకోవడం వల్ల మడమ దగ్గర రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దీంతో మడమ వాపు, నొప్పి తగ్గుతాయి.
వెండి ఆభరణాల వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వెండిలో ఉండే లోహ గుణం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
ఇన్ని ప్రయోజనాలు ఉన్నందునే వెండి పట్టీలు ధరిస్తుంటారు.