స్త్రీలు బొట్టు పెట్టుకోవడం అనేది భారతీయ సాంప్రదాయంలో ఒక భాగం.

స్త్రీలు బొట్టు పెట్టుకుంటే అందంగా ఉంటారు. అయితే బొట్టు అందానికి మాత్రమే కాదు, ఆరోగ్యపరంగా కూడా అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది.

స్త్రీలు బొట్టు ధరించే భాగాన్ని ఆజ్ఞా చక్రం అని అంటారు. ఇది కనుబొమ్మల మధ్య ఉంటుంది.

ఇది మనిషి శరీరంలో అత్యంత శక్తివంతమైన, ఆరవ భాగం.

మానవ శరీరంలో ఉండే వేల నాడులకు కేంద్ర స్థానం ఆజ్ఞా చక్రం. ఈ నాడుల్లో కళ్ళు, మెదడు, పిట్యూటరీ గ్రంథికి సంబంధించిన నాడులు ఉన్నాయి.

ఆజ్ఞా చక్రం నుంచి ప్రాణశక్తి కిరణాలు ప్రసారమవుతాయి.

బొట్టు పెట్టుకునే సమయంలో ఈ ఆజ్ఞా చక్రాన్ని పలు మార్లు చేతి వేళ్ళతో ఒత్తుతుంటారు. 

దీని వల్ల ఆజ్ఞాచక్రం మీద ఒత్తిడి పడి నాడులు ఉత్తేజం చెందుతాయి.

కుంకుమ బొట్టు మాత్రమే కాకుండా బొట్టు బిల్లలు, స్టికర్ల వల్ల కూడా కొట్టినప్పుడు నాడులు ఉత్తేజం చెందుతాయి.

కుంకుమ పెట్టుకుని.. ఆజ్ఞా చక్రాన్ని ఒత్తినప్పుడు అనేక ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద డాక్టర్లు చెబుతున్నారు.

ఇలా ఒత్తడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒత్తిడితో కూడిన మైగ్రేన్ తలనొప్పిని ఇది తగ్గిస్తుంది.  

దృష్టిని, కంటి ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది.  

చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.

డిప్రెషన్ నుంచి మిమ్మల్ని దూరం చేస్తుంది.

వినికిడి శక్తిని పెంచుతుంది.

జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచుతుంది. అంతర దృష్టిని, అవగాహనను మెరుగుపరుస్తుంది.