పాత కాలంలో అంటే చెరువులు ఉండేవి. చెరువుల వద్ద ఉదయాన్నే స్నానం చేసి సూర్య నమస్కారం చేసేవారు.

90ల తరం తండ్రులూ, తాతలు ఇంటి బయటకొచ్చి తూర్పు దిక్కున నిలబడి సూర్య నమస్కారం చేసేవారు.

సూర్య నమస్కారం చేయడం వల్ల భగవంతుని అనుగ్రహం కలగకపోయినా.. భగవంతుడి సమకూర్చిపెట్టిన ఆరోగ్యం ప్రకృతి ద్వారా అందుతుంది.

ఆ ప్రకృతే సూర్యుడు. అయితే సూర్యరశ్మిని ఇప్పుడున్న తరం పొందలేని స్థితిలో ఉన్నారు.

దీనికి కారణం ఇల్లు ఇరుకైపోవడం, ఎండ పడే విధంగా బాల్కనీ గానీ, చిన్న ప్రదేశం గానీ లేకపోవడం. దీని వల్ల చాలా మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు.

విటమిన్ డి అనేది కాల్షియం, ఫాస్పరస్ జీర్ణానికి బాగా పని చేస్తుంది. ఎముకల నిర్మాణాన్ని దృఢంగా ఉంచడంలో విటమిన్ డీ కీలక పాత్ర పోషిస్తుంది.  

ఇది కొవ్వు కరిగించేందుకు, దంతాలను ఆరోగ్యంగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది.

రోగనిరోధక శక్తిని పెంచడానికి, మెదడు, నాడీ వ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉంచేందుకు దోహదపడుతుంది.

ఇన్ని ప్రయోజనాలున్న విటమిన్ డి సూర్యుడి నుంచి ఉచితంగా పొందే అవకాశం ఉన్నా కూడా వినియోగించుకోలేని పరిస్థితి కొందరిది. అలాంటి వారు ఈ ఫుడ్స్ తీసుకుంటే విటమిన్ డి కొరత ఉండదు.

చేపలు, గుడ్డులో పసుపు సొన, పాలు, తృణధాన్యాలు వంటి వాటిలో విటమిన్ డి అధికంగా ఉంటుంది.

సాల్మన్, ట్యూనా, మైకేరల్ వంటి ఫ్యాటీ చేపల్లో విటమిన్ డి అధికంగా ఉంటుంది.  

రోజుకు ఒక మనిషికి కావాల్సిన మోతాదులో 6 శాతం విటమిన్ డి ఈ కోడిగుడ్డు పసుపు భాగంలో లభిస్తుంది.

పుట్టగొడుగులు, పాలు, ఆరెంజ్, దానిమ్మ వంటి వాటిలో విటమిన్ డి ఉంటుంది.

విటమిన్ డి లోపిస్తే ఆస్టియోపోరోసిస్, డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.   

గమనిక: ఇది అంతర్జాలం నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీని గురించి అవగాహన కోసం నిపుణులను సంప్రదించవలసినదిగా మనవి.