వాక్కాయ పేరు పెద్దగా తెలిసి ఉండక పొవచ్చు కానీ ఈకాయ ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు.
ఈ వాక్కాయతో పప్పు,పచ్చడి, పులిహోర లాంటివి చేస్తారు.
వాక్కాయ ఒగరు, పుల్లని రుచితో ఔషధు గుణాలు సమృద్ధిగా కలిగి ఉంటుంది.
ఇంకా ఈ వాక్కాయతో ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం..
ఆస్కార్బిక్ ఆమ్లం కడుపు నొప్పి, మలబద్దకం వంటి సమస్యలను తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుంది.
శరీరంలోని మంటను తగ్గించి, గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
క్యాన్సర్, గొంతు నొప్పిని సమస్యలను తగ్గించడంలో వాక్కాయ సాయ పడుతుంది.
వాక్కాయ రక్తంలో మలినాలను తొలగించి రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
వాక్కాయ శరీరంలో కొల్లాజన్ ఉత్పత్తిని పెంచి చర్మ సమస్యలు లేకుండా చేస్తుంది.
వాక్కాయలో ఐరన్ సమృద్ధిగా ఉండటం వల్ల రక్త హీనత సమస్యను తగ్గిస్తుంది.
వాక్కాయల వలన ఒత్తిడి,ఆందోళన వంటి వాటిని దూరం చేస్తాయి.
వాక్కాయల తినడం వలన నీరసం, అలసట, ఒత్తిడి, తలనొప్పి వంటి సమస్యలు దూరం అవుతాయి.
ఇవి మూత్రపిండాలలో రాళ్ళని కరిగించి మూత్ర నాళాలని శుభ్రం చేస్తాయి.
డయబెటీస్ ఉన్నవారికి వాక్కాయ చాలా బాగా పనిచేస్తుంది.
వాక్కయనిద్రలేమి సమస్యతో బాధపడేవారికి మంచి ఔషధంగా తోడ్పడతాయి.
ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి..మీకు ఈ కాయ దొరికితే కచ్చితంగా ఉపయోగించాలి.