సహజంగా చాలా మంది మనకు మూడ్ బాగలేకపోయినా, ఒత్తిడి పెరిగినట్లు అనిపించినా స్ట్రెస్ బాల్ ను నొక్కుతూ ఉంటారు.

స్ట్రెస్ బాల్ ప్రెస్ చేయడం వల్ల ఒత్తిడి కాస్త తగ్గుతుందని నిపుణులు సూచించడంతో చాలా మంది ఖాళీ సమయాల్లో నొక్కుతూ ఉంటారు.

దీంతో చాలా మంది వైద్యుల సూచనల మేరకు స్ట్రెస్ బాల్ ను ప్రెస్ చేస్తూ ఒత్తిడి నుంచి దూరమవుతారు. 

స్ట్రెస్ బాల్ ను నొక్కడం ద్వారా ఒత్తిడి ఒకటే కాదు, ఇంకా చాలా రకాల సమస్యలు కూడా దూరమవుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు.

స్ట్రెస్ బాల్ ను నొక్కడం ద్వారా దూరమయ్యే ఆ సమస్యలేంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

 స్ట్రెస్ బాల్ ను తరుచు నొక్కడం వల్ల శరీర కండరాలు బలంగా మారడంతో పాటు మణికట్టు కండరాలు సైతం బలంగా మారతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

హార్ట్ రేట్ పెరగడంతో పాటు రక్త ప్రసరణ బాగా పెరుగుతుందని, తద్వారా గుండె సంబంధమై వ్యాధులు దరిచేరవు.

రక్త  ప్రసరణ మెరుగ్గా ఉంటే అధిక రక్త పోటు సమస్య రావడానికి ఆస్కారం ఉండదు.

నిద్రలేమి సమస్యతో బాధపడేవారు సైతం తరుచు స్ట్రెస్ బాల్ నొక్కడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని తెలుస్తుంది.

ముఖ్యంగా ఒత్తిడి, ఆందోళన ఉన్నవారు స్ట్రెస్ బాల్ ను తరుచు ప్రెస్ చేస్తూ ఉండాలని, తద్వారా ఒత్తిడి నుంచి బయటపడొచ్చని సూచిస్తున్నారు.

స్ట్రెస్ బాల్ తరుచు ప్రెస్ చేయడం వల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

ఇక స్ట్రెస్ బాల్ రేటు కూడా చాలా తక్కువగా ఉండడంతో ఖాళీ సమయాల్లో అందరూ ప్రెస్ చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.