సాబుదానా(సగ్గుబియ్యం) ఓ పిండి పదార్ధం. ఇది మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. 

వీటిలో యాంటీఆక్సిడెంట్లు, రెసిస్టెంట్ స్టార్చ్ పుష్కలంగా ఉంటాయి.

సగ్గుబియ్యం తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బులొచ్చే ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తాయి.

వ్యాయామం ఇంకా మెరుగ్గా చేయడానికి సహాయపడతాయి.

షుగర్ పేషెంట్లకు సాబుదానా దివ్య ఔషదంతో సమానం. అసలు దీనిని తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

సగ్గుబియ్యంలో షుగర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. పిండి పదార్థం ఉంటుంది. సగ్గుబియ్యాన్ని తీసుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది.

సగ్గుబియ్యం మన శరీరంలో గ్లూకోజ్ ఉత్పత్తి చేసి, శరీరానికి శక్తిని ఇస్తుంది. రోజువారి పనులు మరింత మెరుగ్గా చేసుకోగలిగే శక్తిని స్తాయిని పెంచుతాయి. శక్తి వనరుకు సాబుదానా మంచి ఉదాహరణ.

సగ్గుబియ్యం అధిక రక్తపోటు పేషెంట్లకు బాగా ఉపయోగపడుతుంది. దీనిలో పొటాషియం కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త ప్రవాహాన్ని మెరుగ్గా ఉంచడానికి సహాయపడుతుంది.

సాబుదానా వల్ల హై బీపీని కంట్రోల్లో ఉంచుతుంది. బ్లడ్ ప్రెజర్ కంట్రోల్లో ఉండాలంటే వీటిని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సగ్గు బియ్యంలో డ్యూటరీ ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మన జీర్ణవ్యస్థను ఆరోగ్యంగా ఉంచడానికి , మరింత మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది.

వీటిని తింటే అజీర్తి అనే సమస్యే ఉండదు. జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారికి ఇది మంచి మెడిసిన్ లా పనిచేస్తుంది.

బరువు పెరగాలనుకునే వారికి ఇది సూపర్ ఫుడ్ అనే చెప్పాలి. వీటిలో కార్భోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీటిని తింటే ఆరోగ్యకరంగా బరువు పెరుగుతారు.

మీకు తెలుసా.. వీటిని తింటే మీ శరీరంలో ఐరన్ లోపం ఉండదు. బరువు తక్కువగా ఉన్నామని ఫీలైతే వీటితో రకరకాల రెసిపీలు చేసుకుని తినండి. ఎంచక్కా బరువు పెరుగుతారు.

సగ్గుబియ్యం గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతో సహాయపడుతుంది. వీటిలో విటమిన్ బి, డైటరీ ఫైబర్ లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి.

ఈ మంచి కొలెస్ట్రాల్.. మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గిస్తుంది. దీంతో గుండె జబ్బులొచ్చే ప్రమాదం తగ్గుతుంది. అంతేకాదు జుట్టు, చర్మానికి కూడా ఇవి చాలా ప్రయోజనకరం.

సగ్గుబియ్యం ఎముకలను బలంగా చేయడానికి సహాయపడుతుంది. దీనిలోని మెగ్నీషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. రెగ్యులర్ గా తింటే ఎముక ఆరోగ్యం బాగుంటుంది.

సాబుదానా రెగ్యులర్ గా తినడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఎముక అరుగుదల ఉండదు. ఎముకలను బలోపేతం చేస్తాయి. బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

రెగ్యులర్ గా సాబుదానాను తీసుకోవడం వల్ల శారీరక ఎదుగుదల బాగుంటుంది. ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది కూడా. దీనిలో ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది.

సగ్గుబియ్యం.. మన మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే మెదడుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది.

నోట్: పైన టిప్స్ పాటించేముందు మీ దగ్గర్లోని డాక్టర్, నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.