సాధారణంగా మనం అనాస పువ్వును బిర్యానీలు, పులావ్ లు లాంటి ప్రత్యేకమైన వంటకాల్లో వాడుతుంటాం.
ఈ అనాస పువ్వును స్టార్ అనిస్ అని కూడా పిలుస్తాం. అయితే ఆయుర్వేదం ప్రకారం ఈ అనాస పువ్వులో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి అంటున్నారు వైద్య నిపుణులు.
ఈ అనాస పువ్వులను ఉపయోగించడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
అనాస పువ్వులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది.
విటమిన్ ఎ తో పాటుగా విటమిన్ సి కూడా లభించడంతో శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దాంతో బాడీ రోగాల బారిన పడదు.
ఇక ఈ పువ్వులో ఉండే థైమోల్, టెర్పినోల్ సమ్మేళనాలు ఉపిరితిత్తుల సమస్యలు అయిన దగ్గు, కఫం లాంటి ఇతర శ్వాసకోశ సమస్యలను దూరం చేస్తాయని అంటున్నారు వైద్యులు.
వికారం, వాంతి వచ్చినట్లు అనిపించినప్పుడు ఈ పువ్వును వేడి నీళ్లలో కలిపి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
ఇక మహిళలకు నెలసరి సమయంలో అనేక ఇబ్బందులు కలుగుతుంటాయి.
ఈ పువ్వు అధిక రక్తస్త్రావాన్ని అరికట్టడంలో తోడ్పడుతుంది.
హార్మోన్లు సమతూల్యం చెంది, నెలసరి క్రమంగా వస్తూ.. సంతానం కలిగే అవకాశాలు మెరుగుపడతాయని నిపుణులు సూచిస్తున్నారు.
జ్వరం వచ్చిన వారు ఈ పువ్వును తీసుకుంటే త్వరగా తగ్గిపోతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
పైన తెలిపిన ప్రయోజనాలు పొందాలి అంటే అనాస పువ్వును నీటిలో వేసి మరిగించి ఆ నీటిని రోజూ ఓ కప్పు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
నోట్: పైన తెలిపిన చిట్కాలు పాటించే ముందు దగ్గర్లోని డాక్టర్, నిపుణుల సలహాలు తీసుకోండి.