ఆరోగ్యకరమైన జీవితానికి నిద్ర చాలా ముఖ్యం. హెల్తీగా ఉండే వాళ్లు రోజుకు 6 నుంచి 7 గంటలు కచ్చితంగా నిద్రపోవాలి.
కానీ పని కారణంగా చాలా మందికి తగినంత నిద్ర దొరకదు. రాత్రిపూట కంటినిండా నిద్రపోని వారు ఈ రోజుల్లో చాలా మందే ఉన్నారు.
సరిగ్గా నిద్రపోవాలంటే మంచి డైట్ ఫాలో అవ్వాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయాలని నిపుణులు చెబుతున్నారు.
రాత్రిళ్లు హాయిగా పడుకోవాలంటే బాడీ టెంపరేచర్ కూడా సరిగ్గా ఉండాలి. చలికాలంలో బాడీ టెంపరేచర్ తగ్గుతూ ఉంటుంది.
ముఖ్యంగా పాదాలు మరీ చల్లగా అయిపోతుంటాయి. దీనివల్ల రక్తనాళాలు దగ్గరకు అయిపోతాయి. దీనివల్ల రక్తం తక్కువగా సరఫరా అవుతుంది.
నేషనల్ స్లీప్ ఫౌండేషన్ సర్వే ప్రకారం.. పడుకునే ముందు పాదాలను వేడిచేయడం వల్ల మీ మెదడుకు సిగ్నల్ ఇవ్వడానికి సహాయపడుతుంది.
రాత్రివేళ మీ పాదాలు వేడిగా ఉండాలంటే సాక్సులను వేసుకోవడం ఉత్తమం.
ఈ సీజన్ లో రోజంతా సాక్సులను వేసుకునేవాళ్లు కొందరు.. కేవలం నిద్రపోయే ముందు వేసుకునేవాళ్లు మరికొందరు.
సాక్స్ లు మీ పాదాలను వెచ్చగా ఉంచడానికి ఎంతో సహాయపడతాయి. నైట్ టైం ఎన్నో ప్రయోజనాలు కలిగేలా చేస్తాయి. వీటిని ధరించడం వల్ల హాయిగా నిద్రడుతుంది.
సాక్స్ లను వేసుకుని పడుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అయితే సాక్స్ లు వేసుకునేటప్పుడు వాటి సైజును చెక్ చేయడం మర్చిపోకూడదు.
ఎందుకంటే మరీ టైట్ గా ఉండే సాక్స్ లను వేసుకుని పడుకుంటే రక్త ప్రవాహం తగ్గే ప్రమాదం ఉంది. ఒకే జత సాక్స్ లు చాలా రోజులపాటు ఉపయోగించేవారు కూడా ఉంటారు.
కొంతమంది పాదాలకు నూనె రాసి ఆ తర్వాత సాక్సులను వేసుకుంటారు. దీనివల్ల పాదాల పగుళ్లు తగ్గుతాయని. కానీ సాక్సులను మాత్రం శుభ్రం చేయరు.
మురికిగా ఉండే సాక్స్ లని మళ్లీ మళ్లీ ఉపయోగిస్తే అది అనర్థాలకు దారితీస్తుంది. వాష్ చేయని సాక్సుల వాసన ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
కాబట్టి ప్రతిరోజూ సాక్స్ లను శుభ్రం చేసుకుని యూజ్ చేయండి. ఏదేమైనా మీ సాక్స్ లు తాజాగా ఉండేలా చూసుకోవడం మంచిది.
రాత్రిపూట సాక్స్ లను వేసుకుని నిద్రపోతే రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఇది గుండె, ఊపిరితిత్తులను, కండరాలను బలోపేతం చేస్తుంది.
రుతువిరతి సమయంలో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. నిద్ర సరిగా పట్టదు. ఇలాంటి టైంలో సాక్స్ లను ధరించి శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్లోకి వస్తుంది.
చాలామంది ఎంతసేపు కళ్లు మూసినా నిద్రమాత్రం అస్సలు రాదు. మంచంపై అటూ ఇటూ దొర్లి దొర్లి ఎప్పటికో నిద్రపోతారు. ఇలాంటి వారికి సాక్సులు బాగా ఉపయోగపడతాయి.
ఎందుకంటే సాక్స్ వేసుకుని పడుకోవడం వల్ల చేతులు, కాళ్లకు రక్త ప్రవాహం పెరుగుతుంది. మీ శరీర ఉష్ణోగ్రత మెరుగ్గా ఉంటుంది. దీంతో మీరు త్వరగా నిద్రపోతారు.
శీతాకాలంలో మడమలు ఎక్కువగా పగులుతుంటాయి. దీనివల్ల విపరీతమైన నొప్పి కలుగుతుంది. కొంతమందికి పగుళ్ల నుంచి రక్తస్రావం కూడా అవుతుంది.
మడమ పొడి గాలికి గురైతే సమస్య పెరుగుతుంది. ఇలాంటి సమయంలో సాక్స్ లను వేసుకుని నిద్రపోవాలి. దీంతో కాలిలోని తేమ అలాగే ఉంటుంది. చర్మం మృదువుగా తయారవుతుంది.