చింతకాయ అంటే మీలో చాలామంది టక్కున గుర్తుపట్టేస్తారు కానీ సీమ చింతకాయలంటే మాత్రం కొందరికే తెలుస్తుంది.

ఎందుకంటే నగరాల్లో ఈ చెట్లు కనిపించవు. అదే గ్రామాల్లో మాత్రం అక్కడక్కడా కనిపిస్తుంటాయి.

ఈ సీమ చింతకాయలను సాంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తారు. 

ఈ చింతకాయల్లో ప్రత్యేకంగా తీపి, పులుపు ఉంటాయి.

ఈ చింతకాయ పచ్చిగా ఉన్నప్పుడు తింటే వగరుగా ఉంటుంది. పక్వానికి వచ్చాక తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది.

తక్కువ మందికి మాత్రమే తెలిసిన ఈ సీమ చింతకాయ సత్తా తెలిస్తే మాత్రం మీరు అస్సలు విడిచిపెట్టరని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో ఇవి చాలా స‌హాయ‌ప‌డ‌తాయి. 

గులాబీ, ఎరుపు, తెలుపు రంగుల్లో ఉండే ఈ సీమ చింత‌కాయ‌లు కాస్త తియ్య‌గా, కాస్త వ‌గ‌రుగా ఉంటాయి.

సీమ చింతకాయల్లో విట‌మిన్ ఎ, బి, సి, మెగ్నీషియం, ఐరన్, కాపర్, ఫాస్పరస్, ప్రోటీన్స్‌, ఫైబ‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా చాలా పోష‌కాలు ఉంటాయి.

సీమ చింత‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఒత్తిడి, డిప్రెష‌న్‌, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌లు దూరం అవుతాయి. జ్ఞాపకశక్తి, మానసిక స్థితి ,ఏకాగ్రత పెరుగుతుంది.

షుగర్ తో బాధపడుతున్నవాళ్లు ప్ర‌తి రోజు త‌గిన మోతాదులో సీమ చింతకాయ‌లు తీసుకుంటే ర‌క్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

సీమ చింతకాయలను తినడం వల్ల ఎక్కువగా ఆక‌లి వేయడం త‌గ్గుముఖం ప‌డుతుంది. దాంతో ఈజీగా వెయిట్ లాస్ అవుతారు.

సీమ చింతకాయ డయేరియా సమస్యను తగ్గిస్తుంది. సీమ చింతకాయ కొమ్మను తీసుకుని మరిగించి ఆ నీళ్ళని తాగితే మీకు ఉన్న డయేరియా సమస్య తగ్గిపోతుంది.

సీమ చింతకాయ.. జిడ్డుగా ఉన్న మాడుకు రెమిడీగా పనిచేస్తుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. వృద్ధాప్యాన్ని దూరం చేస్తుంది.

సీమ చింతకాయలు తినడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. స్కిన్ పై నల్లటి మచ్చలు ఉంటే తగ్గిపోతాయి. మొటిమలు కూడా మెల్లగా తగ్గిపోతాయి.

ఇవి పంటి నొప్పి, చిగుళ్ల నొప్పి, నోటి పూతలని నివారించడానికి తోడ్పడతాయి. యాంటీసెప్టిక్ గా కూడా పనిచేస్తాయి.

సీమ చింతకాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచి కఫాన్ని తగ్గిస్తుంది.

నోట్: పైన టిప్స్ పాటించేముందు మీ దగ్గర్లోని డాక్టర్, నిపుణుల సలహా కూడా తీసుకోవడం ఉత్తమం.