సబ్జా గింజల గురించి అందరికి తెలుసు

సబ్జా గింజల పానీయం మెరుగైన ఆరోగ్యాన్ని ఇస్తుందని ఆయుర్వేదం చెబుతోంది

ఒంట్లో వేడి చేస్తే సబ్జా గింజలను నానబెట్టుకుని పానీయం తాగేవారు

ఇప్పుడు చాలామంది  సబ్జా గింజలను మర్చిపోయారు

సబ్జా గింజల పానీయం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దాం

సబ్జా గింజల్లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడొచ్చు

పడుకునే ముందు ఓ గ్లాసు సబ్జా గింజల పానీయం తాగితే మలబద్దకం సమస్య తీరిపోతుంది

ఊబకాయంతో బాధపడేవారికి సబ్జా గింజల పానీయం మంచి చిట్కాలా పనిచేస్తుంది

చక్కెర వేయకుండా సబ్జా గింజల పానీయం తీసుకుంటే మధుమేహం అదుపులోకి వస్తుంది

నానబెట్టిన సబ్జా గింజల పానీయం టైప్2 మధుమేహం నుండి ఉపశమనం కలిగిస్తుంది

తరచూ డీహైడ్రేషన్ కు గురయ్యేవారు సబ్జా గింజల పానీయం తీసుకోవచ్చు

వికారంగా, వాంతి అనిపించినప్పుడు సబ్జా గింజల పానీయం ఉత్తమం

గొంతు మంట, దగ్గు, ఆస్తమా, తలనొప్పి, జ్వరం లాంటి సమస్యలకు సబ్జా చాలా మేలు

సబ్జా గింజల పానీయం వలన మహిళలకు ఫోలేట్, నియాసిన్, విటమిన్ ఇ పోషకాలు లభిస్తాయి

సబ్జా గింజల పానీయంలో అల్లం రసం, తేనే కలిపి తాగితే శ్వాసకోస వ్యాధులను నివారించొచ్చు