భారతదేశం ఆయుర్వేద ఔషధాలకు పుట్టినిల్లు. మనం ఆయుర్వేదం గురించి తెలుసుకుంటే ప్రతి ఆకు, ప్రతి చెట్టు ఔషధమే.
అలాంటి ఔషధాల్లో సైంధవ లవణం ఒకటి. దీనినే రాక్ సాల్ట్, హిమాలయన్ సాల్ట్, పింక్ సాల్ట్ అంటూ పిలుస్తూ ఉంటారు.
మనకు వచ్చే అనేక అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఇది ఉపయోగపడుతుంది.
థైరాయిడ్ సమస్య ఉన్న వారు ఉప్పుకు బదులుగా రాక్ సాల్ట్ ను వాడడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి
గొంతు నొప్పి, గొంతులో ఇన్ ఫెక్షన్స్ తో బాధపడుతున్న వారు నీటిలో సైంధవ లవణాన్ని కలిపి తాగడం వల్ల ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు
నాలుగు టీ స్పూన్ల వామును వేయించి పొడిగా చేసి దానికి ఒక టీ స్పూన్ సైంధవ లవణాన్ని కలిపి నిల్వ చేసుకోవాలి.
నోటిలో లాలాజలం ఎక్కువగా ఉత్పత్తి అయ్యే వారు ఈ మిశ్రమాన్ని తరచూ తీసుకుంటూ ఉండడం వల్ల అధిక ప్రయోజనం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
వంటల్లో ఉప్పుకు బదులుగా రాక్ సాల్ట్ ను ఉపయోగిస్తే శరీరంలో జీవక్రియలు మెరుగుపడతాయి. అలాగే ఎముకలు, చర్మం, జుట్టు ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
జీర్ణ శక్తిని పెంచడంలో, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలను తగ్గించడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది.