ముల్లంగి.. చాలా మంది ఈ పేరు వినగానే మాకొద్దు అంటారు.

తమ జీవితంలో ఇప్పటి వరకు ముల్లంగి తినని వారు కూడా చాలా మందే ఉంటారు.

ముల్లంగి సాంబార్‌ లో వేసుకోవడానికి మాత్రమే పనికొస్తుంది అనుకుంటారు. కానీ, దాంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ముల్లంగి కామెర్ల నుంచి కాపాడుతుందని చెబుతారు. దీని ఆకులతో కామెర్లను కట్టడి చేసే అవకాశం ఉంది.

ముల్లంగి రక్తాన్ని శుబ్రపరచడమే కాకుండా.. ఎర్ర రక్తకణాలకు ఆక్సిజన్‌ అందిస్తుంది.

శరీరంలోని మలిన పదార్థాలను బయటకు పంపడమే కాకుండా.. జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది.

ముల్లంగిలో పీచు, కార్బోహైడ్రేట్లు, నీటిశాతం అధికంగా ఉండటం వల్ల వెయిట్‌ లాస్‌ కు కూడా బాగా ఉపయోగపడుతుంది.

ముల్లంగి శరీరానికి కావాల్సిన పోషకాలను అందించి.. త్వరగా ఆకలి కాకుండా ఆపుతుంది.

జ్వరం వచ్చినప్పుడు ముల్లంగి రసం సేవిస్తే.. త్వరగా కోలుకునే అవకాశం ఉందంటారు.

జలుబు, దగ్గు, అలర్జీలను తగ్గించడంలో ముల్లంగి కీలక పాత్ర పోషిస్తుందని ఆయుర్వేదం చెబుతోంది.

ముల్లంగిలో యాంటీ క్యాన్సర్‌ గుణాలు అధికంగా ఉంటాయి. దీని వాడకంతో క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు తగ్గుతాయంటారు.

శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో ముల్లంగి సమర్థంగా పని చేస్తుంది.

అంతేకాకుండా ముల్లంగి వాడకంతో మూత్ర సంబంధిత వ్యాధులు దరి చేరవు.

ముల్లంగి కడుపు నొప్పి, తలనొప్పి తగ్గించేందుకు ఉపయోగపడటమే కాకుండా.. నోటి దుర్వాసనను కూడా దూరం చేస్తుంది.

ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే న్యూట్రీషియన్స్ ముల్లంగిని ఆహారంలో భాగం చేసుకోమని చెబుతుంటారు.