సాధారణంగా వేసవి కాలంలో  అనేక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి.. 

వాటి నుంచి రక్షించుకోవాలంటే బలమైన ఆహారం, పండ్ల రసాలు తీసుకోవాలి.

వేసవి సీజన్ లో  తీసుకోవాల్సిన పండ్లలో బత్తాయి పండ్లు కూడా ఒకటి. 

బత్తాయి పండ్లలో   ఫైబర్‌, విటమిన్లు, పొటాషియం అధికంగా ఉంటాయి.  ఆరోగ్యకరమైన ప్రయోజనాలను చేకూర్చుతాయి.

బత్తాయి పండ్లలో  విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది.. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది

బత్తాయి  జ్యూస్‌ను తాగడం వల్ల జలుబు తగ్గుతుంది. ఎలాంటి ఇన్ ఫెక్షన్ల భారిన పడకుండా చేస్తుంది.

తరుచూ బత్తాయి పండ్ల జ్యూస్ తాగడం వల్ల  శరీరంలోని విష, వ్యర్థ పదార్థాలు బయటకుపోతాయి.

అధిక బీపీతో బాధపడేవారు..   రోజూ బత్తాయి పండ్లను తింటే బీపీ కంట్రోల్ లో ఉంటుంది

గ్యాస్ స్ట్రిక్ తో బాధపడేవారు తరుచూ బత్తాయి పండ్లు తినడం లేదా జ్యూస్ తీసుకుంటే మంచిది

బత్తాయి పండ్లు తింటే.. మలబద్దకం సమస్యలు దరిచేరవు

డయాబెటీస్ ఉన్నవాళ్లు  బత్తాయి పండ్లు తింటే షుగర్‌ లెవల్స్‌ పెరగవు. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలోనే ఉంటాయి.

వేసవిలో లభించే  బత్తాయి పండ్లను నేరుగా తినొచ్చు లేదా జ్యూస్‌ చేసుకుని తాగవచ్చు. 

బత్తాయిలో పొటాషియం, ఐరన్, కాల్షియం, విటమిన్స్ ఏ, సి, బి1  సమృద్ధిగా ఉంటాయి

బత్తాయి పండ్లు  గుండెని ఆరోగ్యంగా ఉంచడమే కాదు.. పేగుల్లో వచ్చే అల్సర్, పూతలను తగ్గిస్తుంది.