జొన్న రొట్టె.. ఒకప్పుడు పేదలు ఎంతో ఇష్టంగా తినే ఆహారం. వరి అన్నం పాపులర్ అయ్యాక అందరూ జొన్నల వినియోగం తగ్గించారు.

ఇప్పుడు ఆరోగ్యం కోసం మళ్ళీ అందరూ జొన్న రొట్టెనే తింటున్నారు. మరి.. అంతలా జొన్నరొట్టె వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

జొన్నల్లో బీ కాంప్లెక్స్ విటమిన్స్కు తోడు ఫైబర్, విటమిన్ ఏ, విటమిన్ సీ, క్రూడ్ ఫ్యాట్, అమినో యాసిడ్స్ వంటి అత్యవసర పోషకాలు అధికంగా  ఉంటాయి. 

మధుమేహులకు ఇది చక్కటి భోజనం.

ఇక చపాతీ, రోటీ ఏదైనా తక్కువ కాలంలోనే తినేయాలి. లేదంటే అవి పాడైపోయే అవకాశాలున్నాయి. అయితే జొన్నరొట్టెకు ఆ ఇబ్బంది లేదు. కాస్త ఆలస్యమైనా దీనిని ఇబ్బంది లేకుండా తినేయొచ్చు.

జొన్నరొట్టెలో ఉన్న రెండు రకాలలో ఒకటి కడక్ రోటీ. ఇది గట్టిగా ఉంటుంది. మరోటి సాఫ్ట్రోటీ మెత్తగా ఉంటుంది. వేడిగా ఉన్నప్పుడే దీనిని తినేయాలి. కానీ కడక్ రోటీ అలా కాదు. కొన్ని వారాలైనా పాడయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. 

 నగరంలో జొన్న రొట్టెను వెజిటేబుల్ కర్రీ లేదంటే చికెన్ కర్రీ లాంటి వాటితో కలిపి తీసుకుంటుంటారు.

జొన్న రొట్టెలో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ షుగర్ పేషంట్స్ కి ఇది బెస్ట్ ఫుడ్

జొన్నలలో ఐరన్, కాల్షియం, విటమిన్ బి, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటివి ఉన్నాయి.

వీటి వల్ల  చర్మం, జుట్టు, గుండె, ఎముకల ఆరోగ్యానికి కూడా ఇవి దోహదపడతాయి. 

జొన్నలు జీర్ణక్రియనూ మెరగుపరుస్థాయి. 

 నిజానికి జొన్నలను రోటీ రూపంలో మాత్రమే కాదు ఇడ్లీ, దోశ రూపంలో తినొచ్చు. 

ఊబకాయులు బరువు తగ్గేందుకు కూడా జొన్నలు ఉపయోగపడుతాయి. 

జొన్నల్లో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే.. నెలకి లక్షలు.. లక్షలు సంపాదించేవారు కూడా ప్రతిరోజు కేవలం 20 రూపాయలు ఖర్చు పెట్టి జొన్న రొట్టెలను తినడానికి ఇష్టపడుతున్నారు.