కూరగాయల్లో వంకాయ రారాజు ఐతే.. పండ్లలో మామిడి పండు బాహుబలి రాజు. మామిడి పండుని ఇష్టపడని మనుషులు ఈ భూమ్మీద ఉండరు.

వేసవి కాలం వచ్చిందంటే మామిడి పండ్ల రసాన్ని జుర్రుకోవాల్సిందే. అయితే మామిడి పండ్లతోనే కాకుండా మామిడి ఆకుల వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

మామిడి ఆకులు డయాబెటిస్ ఉన్న వారికి ఎంతో మేలు చేస్తుంది. డయాబెటిస్ చికిత్సలో ఈ మామిడాకులనే వాడతారు.

మామిడి ఆకుల్లో ఆంథోసైనిడిన్స్ అనే టానిన్లు ఉంటాయి. ఇవి డయాబెటిస్ ని తగ్గించడానికి తోడ్పడతాయి.

మామిడి ఆకులను ఎండబెట్టి.. పొడిగా చేసి.. ఆ పొడిని తింటే ఆరోగ్యానికి మంచిది. అలానే మామిడాకులు నీటిలో వేసి మరిగించి.. రాత్రంతా నీటిని అలానే ఉంచాలి.

ఉదయం లేవగానే ఆకులను వడకట్టగా వచ్చిన రసాన్ని పరగడుపున సేవించాలి. ఇలా చేస్తే షుగర్ స్థాయిలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు మామిడి ఆకుల పొడిని తీసుకుని రాత్రంతా నీటిలో నానబెట్టాలి.  ఉదయం లేచిన తర్వాత ఆ నీటిని తాగితే మూత్రపిండాల్లో రాళ్లు కరుగుతాయి.

అధిక రక్తపోటును నియంత్రించడంలో మామిడి ఆకులు బాగా ఉపయోగపడతాయి. మామిడి ఆకులను నీటిలో వేసి మరిగించాలి.

మరిగించగా వచ్చిన రసాన్ని తాగితే అధిక రక్తపోటు సమస్య తగ్గుతుంది.

ఉదర సంబంధిత సమస్యలను తరిమికొట్టడంలో మామిడాకులు బాగా సహకరిస్తాయి.

మామిడాకులని రాత్రంతా నానబెట్టి ఉదయం ఆ ఆకుల రసాన్ని పరగడుపున తాగితే కడుపు సమస్యలు తగ్గుతాయి.

మామిడి ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు జుట్టు డ్యామేజ్ ని తగ్గిస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గించి.. పెరుగుదలకు ఉపయోగపడతాయి.

గమనిక: ఈ చిట్కాలను పాటించే ముందు వైద్యులు సంప్రదించవలసిందిగా మనవి.