మనకి అందుబాటులో ఉండే వాటిలో పెసలు ఒకటి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివి.

వీటిని మొలకెత్తించి లేదా ఉడకబెట్టుకుని గుగ్గిళ్ల రూపంలో తినవచ్చు.

పెసలులో శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉంటాయి.

ఫైబర్, ఫోలేట్, మాంగనీస్, ఫాస్పరస్, ఐరన్, కాపర్, పొటాషియం, జింక్, విటమిన్ బి1, బి2, బి3, బి5, బి6, సెలీనియం వంటి పోషకాలు పెసలులో ఉంటాయి.

పెసలులో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను తొలగించేందుకు ఉపయోగపడుతుంది. 

ఇందులో ఉండే ఐరన్ రక్తం బాగా తయారవ్వడానికి ఉపయోగపడుతుంది.

పెసలులో ఉండే పొటాషియం గుండె సమస్యల నుంచి కాపాడుతుంది.

అంతేకాదు పెసలులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి.

యాంటీ ఆక్సిడెంట్లు.. వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి.

ముఖ్యంగా దగ్గు, జలుబు, జ్వరం వంటి సీజనల్ వ్యాధుల నుంచి రక్షిస్తాయి. 

పెసలు తినడం వల్ల రక్తంలో చెడు కొవ్వు తగ్గుతుంది. ఈ కారణంగా అధిక బరువు తగ్గి.. గుండె జబ్బులు రాకుండా ఉంటుంది.

పెసలులో ఉండే పొటాషియం, మెగ్నీషియం వల్ల రక్త సరఫరా బాగా జరుగుతుంది. దీని వల్ల అధిక రక్తపోటు తగ్గుతుంది.

రక్తనాళాల్లో ఏర్పడే అడ్డంకులు తొలగిపోతాయి. హార్ట్ స్ట్రోక్ రాకుండా ఉంటుంది.

పెసలు తినడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది. చక్కెర అదుపులోకి వస్తుంది.

గర్భిణీలు పెసలు తినడం వల్ల ఫోలేట్ పోషకం అంది.. బిడ్డ ఎదుగుదల బాగుంటుంది.