అల్లం, వెల్లుల్లిని తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం బాగుంటుంది.

ధమనులలో అడ్డంకిని తొలగించడానికి అల్లం, వెల్లుల్లి ఉపయోగపడతాయి. 

కొవ్వుని కరిగించే శక్తి అల్లం, వెల్లుల్లికి ఉంది. 

అల్లంలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్, జింక్, ఫాస్ఫరస్ లాంటి పోషకాలు ఉంటాయి.

జీర్ణ సంబంధిత సమస్యలను తరిమికొడుతుంది. మలబద్ధకాన్ని దరిచేరనివ్వదు.

వాంతులు, వికారం, విరేచనాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

అల్లంతో దగ్గు, జలుబు, ఒంటి నొప్పులు, కడుపు నొప్పి, అజీర్తి, శ్వాసలో ఇబ్బంది ఉండడం వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు.

వెల్లుల్లిలో కూడా ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. 

వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, విటమిన్లు, ఖనిజాలు అధిక మొత్తంలో ఉంటాయి.

కాబట్టి వెల్లుల్లి రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా ఉపయోగపడుతుంది.

వెల్లుల్లి చెడు కొలెస్ట్రాల్ ఆక్సీకరణను నిరోధిస్తుంది. అల్లం కొలెస్ట్రాల్ స్థాయిలను బాగా తగ్గిస్తుంది.

హైబీపీ పేషేంట్లకు వెల్లుల్లి బాగా ఉపయోగపడుతుంది. పచ్చి వెల్లుల్లి తింటే బీపీ కంట్రోల్ లో ఉంటుంది. 

మొటిమలు, అజీర్తి వంటి సమస్యలను కూడా వెల్లుల్లి తగ్గిస్తుంది.