ఈ రోజుల్లో చాలా మంది రాత్రి మిగిలిన అన్నం తినడానికి అస్సలు ఇష్టపడరు.
ఎప్పటి ఫుడ్ అప్పుడే రెడీ చేసుకుంటూ వేడి వేడిగా తింటుంటారు.
కొందరు నిపుణులు మాత్రం చద్దన్నం తినడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు.
అసలు చద్దన్నం ఎలా తయారు చేసుకోవాలి? అది తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?
నిపుణులు ఏం చెబుతున్నారో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే
చద్దన్నం ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఓ కుండలో వండుకున్న అన్నంలో పాలను వేడి చేసుకుని చల్లారిన తర్వాత అందులో పోయాలి.
ఆ పాలు చల్లారిన తర్వాత అందులో కాస్త పెరుగు వేసి తోడు పెట్టుకోవాలి.
దానిపై మూత పెట్టుకుని రాత్రంతా అలాగే ఉంచాలి.
ఇక మరుసటి రోజు అందులో పచ్చి మిర్చి, ఉల్లి ముక్కలు, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలపడంతో చద్దన్నం రెడీ అవుతుంది.
దీనిని రోజూ ఉదయాన్నేతీసుకోవడం వల్ల ఎముకలు గట్టిపడతాయని నిపుణులు తెలియజేస్తున్నారు.
అంతేకాకుండా దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా జీర్ణ వ్యవస్థ మెరుగుపడడంతో పాటు మలబద్దకం సమస్యలు కూడా దరిచేరవట.
ముఖ్యంగా వేసవి కాలంలో ఈ చద్దన్నం తినడం వల్ల శరీరంలో వేడి తగ్గడంతో పాటు గుండె పని తీరును మెరుగు పరుస్తుంది.
అనిమియాతో బాధపడేవారికి ఉపశమనం ఇవ్వంతో పాటు హైబీపీని తగ్గిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.