కోడిగుడ్డు మనుషుల ఆరోగ్యానికి మంచి చేస్తుందనే విషయం తెలిసిందే
గుడ్డులో ఉండే ప్రోటీన్స్ మానవ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి
అందుకే ప్రతిరోజూ కనీసం ఒక గుడ్డు అయినా తింటే మంచిదని వైద్య
ులు చెబుతుంటారు''
ఫిట్‌నెస్ కి ప్రాధాన్యతనిచ్చేవారు గుడ్డు లోపలి పసుపు భాగాన్ని తీసివేసి తెల్లటి భాగాన్ని తింటారు
మరి గుడ్డులోని పసుపు భాగాన్ని ఎందుకు తీసేస్తారు? అలా చేయడం సరైనదేనా? అనేది ఇప్పుడు చూద్దాం
గుడ్డులోని పసుపు సొన వల్లే కలిగే ఉపయోగాలు తెలిస్తే అస్సలు
దూరం పెట్టలేరు
పచ్చసొనలో కొవ్వు ఉంటుందని, శరీరానికి అది హానీకరమని భావించి
కొందరు గుడ్డు తినరు
అయితే, గుడ్డులోని పచ్చ సొనలో 186 మిల్లీ గ్రాము కొలెస్ట్రాల
్ ఉంటుందట
అది శరీరానికి అంత హానీకరం కాదని వైద్య నిపుణులు చెబుతున్నార
ు
మానవ శరీరానికి కొలెస్ట్రాల్ కూడా అవసరం. ఇది టెస్టోస్టిరాన్
అందించి.. కండరాలను పెంచుతుంది
గుడ్డు పచ్చసొనలో విటమిన్లు A, D, E, B-12, K, ఐరన్, రిబోఫ్ల
ేవిన్ వంటివి ఉంటాయి
గుడ్డులోని తెల్లటి భాగాన్ని మాత్రమే తింటే.. కావాల్సిన పోషక
ాలను దూరం చేస్తున్నట్లేనట
అందుకే.. గుడ్డులోని పసుపు సొన కూడా తినాలని నిపుణులు సూచిస్
తున్నారు
అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్‌లో హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్
హెల్త్ నివేదిక ప్రకారం
వారానికి 7 గుడ్లు తినేవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువట
అయితే, ఒకే రోజులో పచ్చ సొనతో 7-8 గుడ్లు తింటే మాత్రం ఆరోగ్యానికి
మంచిది కాదని స్పష్టం చేశారు
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి