అంజీరా పండ్లను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తింటున్నారా? అయితే మీ  గుండెకు ఎలాంటి డోకా ఉండదంటున్నారు వైద్యులు.

ఇలా తినడం వల్ల గుండె నుంచి షుగర్ వరకు అనేక అనారోగ్య సమస్యలు మీ దరిచేరవు అని నిపుణులు సూచిస్తున్నారు.

అంజీరాలో కొలెస్ట్రాల్ ఉండదు. అదీ కాక అందులో తక్కువ స్థాయిలో సోడియం, కార్బోహైడ్రేట్స్ ఉండటం వల్ల అవి శరీరానికి బాగా ఉపయోగపడతాయి.

ఇక వీటిని రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినడం ద్వారా చాలా అనారోగ్య సమస్యలు  తొలగిపోతాయి అని వైద్యుల సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బరువును తగ్గిస్తుంది అంజీరా (అత్తిపండ్లు)లో ఫైబర్ శాతం ఎక్కువ.. అందుకే దీన్ని సూపర్ ఫుడ్ అంటారు. 

వీటిల్లో కొలెస్ట్రాలు చాలా తక్కువ. దాంతో మీరు బరువు పెరుగుతారు అన్న అనుమానం ఉండదు.

ఎముకలను స్ట్రాంగ్ గా ఉంచుతుంది అంజీరాలో కాల్షియం సరిపోను ఉంటుంది. శరీరంలోని ఎముకలకు కాల్షియం చాలా అవసరం. 

అది ఎముకల గట్టిదనానికి తోడ్పడుతుంది. కాబట్టి ఎముకలు గట్టిదనానికి వీటిని తినడం ఎంతో ముఖ్యం.

మలబద్దకాన్ని నివారిస్తుంది అంజీరాలు నానబెట్టి తింటే.. అది మీ జీర్ణవ్యవస్థ సమస్యలను ఇట్టే పోగొడుతుంది. 

ఇందులో ఉండే రసాయానాలు మీ పేగుల కదలికలను స్పీడ్ చేస్తాయి. దాంతో మలబద్దక సమస్య తీరుతుందని నిపుణుల సూచన.

పునరుత్పత్తికి తోడ్పడుతుంది అత్తిపండ్లలో పుష్కలంగా మెగ్నీషియం, ఐరన్, మాంగనీస్ లాంటి ఖనిజాలు ఉంటాయి. 

 మహిళల పునరుత్పత్తిలో ఇవి సహాయపడతాయి. హార్మోన్స్ బ్యాలన్స్ చేస్తాయి. PMS ప్రాబ్లమ్స్ పై ఈ పండ్లు చాలా బాగా పనిచేస్తాయి.

రక్తంలో షుగర్ లెవల్స్ ను నియంత్రిస్తాయి అంజీరా పండ్లలో క్లోరోజెనిక్ ఆమ్లం, పోటాషియం లాంటి రసాయనాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి చక్కగా ఉపయోగపడతాయి.