ప్రస్తుత జనరేషన్ లో ప్రతిఒక్కరూ ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాంటి ఫుడ్ మాత్రమే తింటున్నారు.
ఇక హెల్తీ ఫుడ్స్ లో సలాడ్స్ కచ్చితంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
వీటిలో సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ ఒక గిన్నె సలాడ్ తింటే ఆరోగ్యం బాగుంటుంది.
సలాడ్స్ వల్ల మనకు కావాల్సిన పోషకాలు అందుతాయి. ఇంకా ఏయే ప్రయోజనాలు ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం.
సలాడ్లలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. రోజుకి గిన్నెడు సలాడ్ తిన్నా చాలు ఆరోగ్యంగా ఉంటాం.
సలాడ్ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ అని పిలిచే లిపోప్రొటీన్, శరీరంలో తగ్గిపోతుంది.
వివిధ పండ్లు, కూరగాయల సలాడ్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పోషకాల లోపాన్ని పోగొడుతాయి.
బరువు తగ్గడం సులువు కాదు. రెగ్యులర్ గా జిమ్ చేస్తూ ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ కి దూరంగా ఉండాలి.
ఫైబర్ రిచ్ ఫుడ్స్ తినాలి. అప్పుడే సులువుగా బరువు తగ్గుతారు.
ముఖ్యంగా రోజూ ఓ బౌల్ సలాడ్ ని తింటే కూడా ఇంకా ఫాస్ట్ గా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మీ శరీరంలో మంచి కొవ్వులను పెంచడానికి నువ్వులు, అవిసె గింజలు, చియా గింజలను సలాడ్ కు జోడించండి
వీటిని కాల్చి లేదా ముడి విత్తనాలుగా తీసుకోవచ్చు.
ఇవి మీ శరీరంలో మంచి కొవ్వులను బాగా పెంచుతాయి. అవకాడో మీ శరీరరంలో కొవ్వుని కరిగించడానికి సహాయపడుతుంది.
మన శరీరంలో విటమిన్ K లోపం వల్ల ఎముకలు ఖనిజ సాంద్రత, పెరుగుదలను తగ్గుతుంది. మీ సలాడ్ లో బచ్చలికూర జోడీస్తే.. ఎముకలు బలంగా తయారవుతాయి.
రోమైన్, బచ్చలికూర లాంటి ఆకు కూరల్లో కెరోటినాయిడ్లు పుష్కలం. ఇవి కంటి చూపును మెరుగుపరుస్తాయి. ఫ్రీ రాడికల్స్ నుంచి కళ్లను రక్షిస్తాయి.
బచ్చలికూర లాంటి ఆకుకూరలతో లభించే పోషకాలు మైటో కాండ్రియాను పెంచుతాయి. దీంతో కండరాల పనితీరు మెరుగుపడుతుంది.
ఇది శక్తిని ఉత్పత్తి చేయడానికి, మన కండరాలకు శక్తినివ్వడానికి సహాయపడుతుంది.
ప్రతిరోజూ ఆరోగ్యకరమైన సలాడ్ ను తీసుకోవడం వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది. ఎందుకంటే వీటిలో ఫైబర్, ఫోలేట్ స్థాయిలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి.
ఇది ఆరోగ్యకర హార్ట్ బీట్ ఉంచడానికి సహాయపడుతుంది. స్ట్రోక్, గుండెపోటు లాంటి గుండె జబ్బులను తగ్గిస్తుంది.
నోట్: పైన టిప్స్ పాటించేముందు మీ దగ్గర్లోని డాక్టర్, నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.