వేసవి కాలంలో వచ్చే మామిడి పండ్లను అందరూ ఎంతో  ఇష్టంగా తింటుంటారు. 

వేసవి కాలంలో వచ్చే మామిడి పండ్లను అందరూ ఎంతో  ఇష్టంగా తింటుంటారు. 

మామిడి కాయలను తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల లాభాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

వేసవిలో వచ్చే పచ్చి మామిడి కాయలను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

అసలు నిపుణులు ఏం చెబుతున్నారో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

పచ్చి మామిడి కాయలో విటమిన్ సీ, ఏ, బీ6,కే పుష్కలంగా ఉంటాయి.

ఇలాంటి విటమిన్లు కలిగి ఉన్న మామిడి కాయలను తినడం ద్వారా చాలా రకాల ఉపయోగాలున్నాయని చెబుతున్నారు.

అంతేకాకుండా ఈ పచ్చి మామిడి కాయలో మెగ్నిషియం, కాల్షియం, ఐరెన్, ఫైబర్, డైటరీలు ఉంటాయి.

ఇన్ని గుణాలు కలిగి ఉన్న మామిడి కాయలను తినడం ద్వారా డీహైడ్రేషన్ ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు.

అంతేకాకుండా శరీరాన్ని కూల్ గా ఉంచడంలో కూడా పచ్చి మామిడి కాయలు సహయపడతాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

అయితే పచ్చి మామడి కాయలను ఒక్కొరు ఒకలా తింటుంటారు.

కొందరు చెట్టు నుంచి కోసుకుని అలాగే తింటుంటే.., మరికొందరు మాత్రం కట్ చేసుకుని వాటిపై కారం చల్లుకుని తింటుంటారు. 

ఏదేమైనా పచ్చి మామిడి కాయలను తినడం ద్వారా శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

NOTE: ఇది కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే. పూర్తి సమాచారం కోసం పోషకాహార నిపుణులను సంప్రదించండి