ద్రాక్ష పండ్లలో విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ లతోపాటు పొటాషియం, కాల్షియం, సెలీనియం, ఐరన్, ఫాస్పరస్, మెగ్నిషియం వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.
ద్రాక్ష పండ్లను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది
ద్రాక్ష పండ్లను తరచూ తినడం వల్ల మలబద్దకం వంటి జీర్ణాశయ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
గుండె దడ, ఆయాసం, తీవ్రమైన ఒత్తిడి వంటి సమస్యలను ఎదుర్కునే వారు తరచూ ద్రాక్ష పండ్లను తినడం వల్ల ఆయా సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
నీరసంతో బాధపడుతున్నప్పుడు ద్రాక్ష పండ్లను తినడం వల్ల శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది.