పప్పు అన్నంలో విటమిన్ ఎ,బి,బి1,ఇ, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.
అయితే కొందరికి పప్పు అన్నం తిన్నడం అంటే ఇష్టం ఉండదు.
అన్నం పప్పు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
రాత్రి పూట అన్నంలో పప్పు చారు వేసుకుని తినడం వల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
తేలిక పాటి ఆహారం తినడం వల్ల మానసిక స్థితి కూడా మెరుగ్గా ఉంటుంది.
ఫిట్ నెస్ ను ఇష్టపడేవారు రాత్రి పూట పప్పు అన్నం తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
పొట్టకు సంబంధించిన సమస్యలున్న వారు రాత్రిపూట పప్పు అన్నం తినాలని నిపుణులు చెబుతున్నారు.
ఏదైనా తిన్నతర్వాత కడుపులో మంట పుడితే పప్పు అన్నం తినండి. వెంటనే ఉపశమనం పొందుతారు.
పప్పు, బియ్యం బరువు తగ్గేందుకు కూడా సహాయపడతాయి.
ఈ దాల్ రైస్ అజీర్తి , మలబద్దకం, గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
ఈ పప్పు అన్నంలోని కాల్షియం, ప్రోటీన్లు ఎముకలను, కండరాలను బలంగా చేస్తాయి.
పప్పు అన్నం తినేటప్పుడు అన్నం కంటే పప్పే ఎక్కువగా ఉండేట్టు చూసుకోండి.