మనం ప్రతి రోజూ ఆహారంలో భాగంగా పెరుగును కూడా తీసుకుంటూ ఉంటాం.

పెరుగును చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. కొందరికి పెరుగుతో తిననిదే భోజనం చేసినట్టు ఉండదు. 

అయితే పెరుగు తినడం వలన కలిగే ఆరోగ్య  ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

శరీరానికి మేలు చేసే లాక్టోబెసిల్లస్ వంటి బాక్టీరియాలు పెరుగులో ఉంటాయి. 

పెరుగులో కాల్షియం అధికంగా ఉంటుంది. దీనిని తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి.

పుల్లని పెరుగును అరటి పండుతో కలిపి తినడం వల్ల కడుపులో మంట తగ్గుతుంది.

పెరుగును మజ్జిగలా చేసి.. జీలకర్ర, కరివేపాకు,కొంచెం శొంఠిని కలిపి తాగితే వాంతులు, డయేరియా తగ్గుతాయి. 

రోజూ తప్పకుండా పెరుగును తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు.

పొట్ట చుట్టూ ఉండే కొవ్వును కరిగించడంలో పెరుగు ఎంతగానో ఉపయోగపడుతుంది. 

పెరుగుకు మన శరీరంలో జీవక్రియల రేటును పెంచే శక్తి ఉంది. 

సౌందర్య సాధనంగా కూడా పెరుగు ఉపయోగపడుతుంది.

పెరుగును ప్రతిరోజూ తినడం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. 

మలబద్దకం, డయేరియా, మొలలు వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా పెరుగు ఉపయోగపడుతుంది.

పిల్లలకు దీనిని ప్రతిరోజూ ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది.

వ్యాయామం చేసిన తరువాత ఒక కప్పు పెరుగును తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ఇలా పెరుగు వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.