మనం ఆరోగ్యం కోసం పళ్లు, ఫలాలు తింటుంటాం. వాటిలో చాలా మటుకు తొక్కతీసి తినేవి.
తొక్కే అని తీసిపారేయండి. వాటితో కూడా అనేక ప్రయోజనాలు ఉంటున్నాయంటున్నారు డాక్టర్లు
ముఖ్యంగా కివీ ఫలాలు. వీటిని కూడా తొక్కతీసే తింటారు. కివీ తొక్క వల్ల కూడా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
కివీ తొక్కలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది.
ఫైబర్, ఫోలేట్, విటమిన్ ఇ మొదలైన మంచి పోషకాలు, యాంటీ ఆక్సిండెట్లు పుష్కలంగా ఉన్నాయి
ఈ పండు తొక్కలో రెండు ప్రధాన యాంటీ ఆక్సిడెంట్లున్నాయి. ఇందులో ఒకటి విటమిన్ సి, రెండవది విటమిన్ ఇ.
కివీ తొక్కలు తినడం వల్ల ఫైబర్ 50 శాతం పెరుగుతుంది. ఫోలేట్ 32 శాతం, విటమిన్ E 34 శాతం పెరుగుతుంది.
ఈ తొక్క తినడం పూర్తిగా సురక్షితం. ఎలాంటి విష రసాయనాలు ఉండవు.
ఇందులో ఫ్లేవనాయిడ్స్, కరగని ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ అలెర్జెనిక్ సమ్మేళనాలున్నాయి.
కివీ గుజ్జులో కన్నా తొక్కలోనే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
వీటిని తినడం వల్ల స్టెఫిలోకాకస్, ఇ.కోలి వంటి ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది.
కివీ తొక్కలు గుండెకు మేలు చేస్తాయి. మలబద్ధకం, పెద్దప్రేగు క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడతాయి
గర్భిణీ స్త్రీలకు మేలు చేస్తాయి.