కరివేపాకును సాధారణంగా ప్రతి కూర పోపులో వేస్తుంటాం. కానీ చాలామంది దాన్ని తినకుండా పక్కన పెట్టేస్తుంటారు.

నిజానికి కరివేపాకులో ఎన్నో ఔషద గుణాలుంటాయి. దీన్ని పరగడుపున అంటే ఉదయం లేవగానే తినడం వల్ల ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.

కరివేపాకులో విటమిన్ సీ, ఫాస్పరస్, ఐరన్, కాల్షియం, నికోటినిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గడానికీ ఇది చాలా ఉపయోగపడుతుంది.

శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గించే కార్బజోల్ ఆల్కలాయిడ్స్.. కరివేపాకులో పుష్కలంగా ఉంటాయి. దీన్ని క్రమం తప్పకుండా తింటే బరువు తగ్గొచ్చు.

కరివేపాకును కడుపునొప్పిని తగ్గించడానికి కూడా ఉపయోగిస్తారు. మజ్జిగలో కలిపి తాగడం వల్ల కడుపు నొప్పితో పాటు విరేచనాలు, మల బద్ధకం, వాంతులు వెంటనే తగ్గిపోతాయి.

కరివేపాకు ప్రేగు కదలికలను మెరుగుపరుస్తుంది. అలానే జీర్ణ ఎంజైమ్ లను ఉత్తేజపరుస్తుంది.

గర్భం దాల్చిన ఆరు నెలల వరకు వాంతులు, వికారం, అలసట లాంటి సమస్యలు వస్తాయి. వీటి ఉపశమనం కోసం కరివేపాకు సహాయపడుతుంది.

కరివేపాకు ఆకులను మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది.

ఆల్జీమర్స్ లాంటి మెమొరీ రుగ్మతలని కూడా తగ్గించడానికి ఇది సహాయపడుతుంది.

శరీరంలో ఇన్ ఫెక్షన్స్ వల్ల ఎన్నో వ్యాధులు వచ్చే అవకాశముంది. వీటితో పోరాడటానికి కరివేపాకు సహాయపడుతుంది.

కరివేపాకులోని లినోలోల్ సమ్మేళనం వల్ల ఇది రుచిగా ఉంటుంది. వీటిలో బ్యాక్టీరియాని నాశనం చేసే లక్షణాలు ఉంటాయి.

కరివేపాకు షుగరే పేషెంట్స్ కి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలో సమర్ధవంతంగా తగ్గిస్తుందని పరిశోధకులు కనుగొన్నారు.

కరివేపాకులో ఉండే రాగి, ఇనుము, జింక్, ఇనుము లాంటి ఖనిజాలు డయాబెటిస్ ని నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి.

కరివేపాకు కంటిచూపు మెరుగుపరచడంలో సహాయపడుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది!

కరివేపాకులోని కార్బజోల్ సమ్మేళనం గాయాలని నయం చేసే ప్రక్రియ వేగవంతం చేస్తుంది. జట్టు పెరుగుదలను పునరుద్ధరించడానికి సహాయపడతాయి.

కరివేపాకు జట్టును నల్లగా చేయడానికి సహాయపడుతుంది. అలానే ఇది రాలడాన్ని తగ్గిస్తుందని, చుండ్రు పోగొట్టడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.