దాల్చిన చెక్క వంటింట్లో ఉపయోగించే మసాలా దినుసుల్లో ఇది కూడా ఒకటి. బిర్యానీ, పలావ్ వంటి వంటకాల్లో దాల్చిన చెక్కను వాడతారు.

దాల్చిన చెక్క రుచినే కాకుండా ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది.

దాల్చిన చెక్క, యాలకులు, బిర్యానీ ఆకులను సమపాళ్లలో తీసుకుని చూర్ణంగా తయారుచేసుకోవాలి.

పావు టీ స్పూన్ చూర్ణాన్ని మరుగుతున్న టీలో వేయాలి. కాసేపు మరిగిన తర్వాత ఈ టీ తాగితే నరాలు ఉత్తేజితమవుతాయి. మానసిక స్థితి మెరుగుపడుతుంది.

శరీరంలో ఉన్న కొవ్వుని కరిగించే శక్తి దాల్చిన చెక్కకి ఉంది. దీని వల్ల సులువుగా బరువు తగ్గుతారు.  

రోజూ దాల్చిన చెక్క చూర్ణాన్ని,తేనెతో కలిపి సేవించడం వల్ల నీరసం తగ్గుతుంది.

చర్మంపై ఉన్న ముడతలను సైతం ఇది తగ్గిస్తుంది.

రాత్రి అన్నం తిన్న తర్వాత పడుకునే ముందు దాల్చిన చెక్క ముక్కను కొద్దిగా తీసుకుని నోట్లో వేసుకుని చప్పరిస్తే నోటి దుర్వాసన తగ్గుతుంది. నోట్లో ఉన్న క్రిములు నశిస్తాయి.

దాల్చిన చెక్కను చప్పరించడం వల్ల నిద్రలేమి సమస్య కూడా తగ్గుతుంది.

దాల్చిన చెక్కలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరస్, యాంటీ ఫంగస్ లక్షణాలు ఉంటాయి. ఇది దగ్గు, జలుబు వంటి సమస్యలను తగ్గిస్తాయి.

చిటికెడు దాల్చిన చెక్క పొడిని తేనెతో కలిపి డైలీ ఉదయం, సాయంత్రం తీసుకుంటే దగ్గు, జలుబు తగ్గుతాయి.

అతి మూత్రం, మధుమేహం, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి అనారోగ్య సమస్యలకు దాల్చిన చెక్క చక్కని పరిష్కారం చూపుతుంది.

రక్తపోటును నియంత్రించి.. జీర్ణశక్తిని మెరుగుపరచడంలో దాల్చిన చెక్క అద్భుతంగా పనిచేస్తుంది.

గమనిక: ఈ చిట్కాని పాటించే ముందు నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాల్సిందిగా మనవి.