గర్భీణీ స్త్రీలు దీనిని వాడకపోవటమే మంచిది. చిన్నారులకు కూడా పెట్టకపోవటమే మేలు. ఎందుకంటే ఇందులో వీటి గింజల్లో చిన్నారులకు హానికలిగించే విషపదార్ధం ఉంటుంది.
రక్తాన్ని శుద్ధి చేయడంలో కాకరగాయ ఎంతో కీలకంగా పనిచేస్తుంది. అంతేకాదు, కాలినగాయాలు, పుండ్లను మాన్పడంలో కూడా కాకరగాయ చక్కగా పనిచేస్తుంది.
కంటి సమస్యలను తగ్గిస్తుంది. ఉదర సమస్యలకు, అజీర్ణం, కడుపులో మంట వంటి సమస్యలకు కాకరకాయ రసానికి మించిన సంజీవని లేదు.