ప్రకృతిలో మనకు సహజసిద్ధంగా లభించే వాటిలో బార్లీ గింజలు ఒకటి. ఇది గడ్డి జాతికి చెందినది.  ఇందులో విటమిన్-బి నీటిలో కరిగే తత్వం కలిగి ఉంటుంది.

పావు కప్పు బార్లీ గింజలను రెండున్నర లీటర్ల నీళ్లలో పోసి బాగా మరిగించి తాగితే.. పేగులలో ఉండే మలినాలు పోయి.. వాటి పనితీరు ఎంతో మెరుగవుతుంది.

వేసవి కాలంలో అజీర్తి సమస్యలను తొలగించడానికి బార్లీ నీళ్లు ఎంతో ఉపయోగపడతాయి. 

క‌డుపులో మంట‌, అసిడిటీ, అజీర్ణం ఉన్న‌వారు బార్లీ గింజలను నానబెట్టి ఆ నీటిని తాగితే మంచిది. 

బార్లీ నీరు తరుచూ తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్యలు తీరిపోతాయి. 

జ్వరంతో బాధపడే చిన్నపిల్లలకు బార్లీని పాలతోగాని లేదా పండ్ల రసంతో గాని కలిపి ఇవ్వవచ్చు. నిరసంగా ఉంటే.. బార్లీని గ్లూకోజ్ తో కలిసి ఇస్తే శక్తి వస్తుంది.

బార్లీ గింజలు, మజ్జిక, నిమ్మరసం కలిపి తాగితే మూత్ర సంబంధిత వ్యాధులు నిర్మూలించబడతాయి.

బార్లీని రవ్వలాగా కానీ.. మెత్తటి పిండిలా  చేసిన ఫలహారాలను తింటే త్వరగా జీర్ణం అవుతాయి.. శరీరంలోని కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది. 

బాలింతలకు తక్కువ పాలు తక్కువగా పడితే.. బార్లీ గింజలను పాలతో కలిపి తాగితే ఎంతో గొప్ప ప్రయోజనం ఉంటుంది. 

మూత్ర విసర్జన సమయంలో మంట, నొప్పి ఏర్పడితే.. బార్లీ గింజలను బెల్లం, నిమ్మరసంతో కలిపి తీసుకుంటే మంచి ఉపశమనం ఉంటుంది.

అనారోగ్యంతో బాధపడేవారు.. ప్రతిరోజూ బార్లీ గంజిని తాగితే నీరసం తగ్గి మంచి శక్తిని ఇస్తుంది.