రోజూ ఒక అరటిపండును తింటే ఆరోగ్యానికి మంచిది.

ఈ అరటి పండు ద్వారా ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.

అరటిపండు శరీరంలో ఉండే అదనపు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.

అరటి పండ్లలో విటమిన్ బి6, బి12, కాల్షియం,పొటాషియం,మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. 

సాధారణంగా అందరం తొక్కపడేసి.. అరటి పండును మాత్రమే తింటాము.

అయితే అరటిపండ్లతో పాటు వాటి తొక్కలను కూడా తినేయొచ్చు.

అరటి తొక్కలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అరటి తొక్కలు చర్మ రక్షించడంతో పాటు ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తాయి. 

అరటి తొక్కను వెన్నతో కలిపి తింటే కంటి ఆరోగ్యం బాగుంటుంది.

అరటి తొక్కలను తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. 

అరటి తొక్కల్లో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. 

అరటి పండ్లను తొక్కతో సహా రోజూ తింటే అధిక రక్తపోటు సమస్య అదుపులో ఉంటుంది.

హైబీపీ పేషెంట్లు తొక్కను మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో తింటే మంచిది. 

అరటి తొక్కలు ఎముకలను బలంగా చేయడానికి కూడా సహాయపడతాయి. 

ఎముకలు బలహీనంగా ఉన్నవాళ్లు అరటిపండును తొక్కతో సహా తినడం మంచిది. 

అరటి తొక్క కంటి చూపును మెరుగుపర్చడంతో పాటుగా కళ్ల సమస్యలను తగ్గిస్తుంది.

అరటి తొక్క మొటిమలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.