అందరికి తెలిసిన ఆరోగ్యకరమైన పండ్లలో అవకాడో ఒకటి

ఈ అవకాడోని ఒక పండుగానే కాకుండా సలాడ్స్ లో కూడా తీసుకోవచ్చు

అవకాడోను బటర్ ఫ్రూట్ లేదా అలిగేటర్ పియర్ అని కూడా పిలుస్తారు

అవకాడోలో ప్రధానంగా 7 రకాలు ఉంటాయి హాస్, మలుమ, ఫ్యూర్టె, బేకాన్, వుర్ట్జ్, షర్విల్, పింకర్టాన్

అవకాడోలో అత్యధికంగా ఫైబర్ ఉంటుంది. ఇది బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది

దీనిలో మోనోశాచ్యురేటెడ్ కొవ్వు పధార్థాలు ఉండటం వలన కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది

అవకాడోలో ఉండే ఇన్సులిన్ రెసిస్టెంట్స్.. డయాబెటిక్ పేషంట్స్ రక్తంలోని చక్కర స్థాయిలను నియంత్రిస్తాయి

అవకాడోలో ఉండే ల్యూటేన్, జియాక్సాంథిన్ లాంటి కెరోటినాయిడ్స్ కళ్లను కాపాడుతాయి

అవకాడోలు క్యాన్సర్ చికిత్సలో కూడా ముఖ్యపాత్రను పోషిస్తాయి

అవకాడోలలో అత్యధికంగా ఉండే ఫోలేట్.. గర్భస్రావం, నాడీ సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది

అధ్యయనాల ప్రకారం.. అవకాడో డిప్రెషన్, ఆందోళనలను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది 

అవకాడోలోని నూనెలు.. ఆస్టియో ఆర్థరైటిస్ సమస్యను తగ్గించవచ్చునని అధ్యయనాలు చెబుతున్నాయి

అవకాడోలో ఫైబర్ నిక్షేపాలు ఉన్న కారణంగా, జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపరుస్తుంది

అవకాడోలోని పోషకాలు చర్మాన్ని ఆరోగ్యపరుస్తూ ముడుతలు, చారలను ఆలస్యం చేస్తాయి