చాలా మంది  తలలో పేల సమస్యతో తెగ బాధపడుతుంటారు.

చిన్నా పెద్దా అనే లేకుండా పేల సమస్య అనేది అందరిని బాధిస్తూ ఉంటుంది.

ఈ సమస్య వలన మన తలలో దురద చికాకు వస్తుంది.

తలలో నుంచి పేల‌ను పట్టుకునేందుకు ప్రత్యేక దువ్వెన‌లు కూడా ఉంటాయి. 

ఈ దువ్వెన‌ల‌తో దువ్వి పేల‌ను కుక్కి చంపేస్తూ ఉంటారు. 

కానీ వీటి సమస్య ఎక్కువ అయినప్పుడు ఈ దువ్వెనతో సాధ్యం కాదు.

అయితే పేల‌ను నివారించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పేల నుండి ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌డానికి అనేక ర‌కాల షాంపులు ఉన్నాయి.

కానీ ఆ షాపులు ర‌సాయ‌నాల‌తో త‌యారు చేయ‌బ‌డినవి.

అయితే స‌హ‌జ సిద్ద ప‌దార్థాల‌తో కూడా పేల నుండి విముక్తిని పొంద‌వ‌చ్చు.

దీని కోసం ఒక గిన్నెలో రెండు స్పూన్ల వెనిగ‌ర్ ను తీసుకుని..అంతే మోతాదులో నీటిని వేసి క‌ల‌పాలి. 

కొద్ది సమయం తరువాత ఈ మిశ్రమాన్ని త‌ల‌కు రాసి ఆర‌నివ్వాలి.

ఒక గంట సమయం త‌రువాత కుంకుడుకాయ ర‌సంతో త‌ల‌స్నానం చేయాలి. 

ఇలా చేయ‌డం వ‌ల్ల పేల బాధ నుండి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.

ఒక క‌ప్పు కొబ్బరి నూనెలో ఒక టీ స్పూన్ క‌ర్పూరం బిళ్లల‌ను వెచ్చబెట్టాలి.

ఈ గోరు వెచ్చ నూనెను త‌ల‌కు రాసి బాగా మ‌ర్దనా చేయాలి. 

అదే విధంగా గుప్పెడు తుల‌సి ఆకుల‌ను నూరి రాత్రి ప‌డుకునే ముందు త‌ల‌కు  బాగా రాసుకోవాలి.

ఉద‌యం లేచిన త‌రువాత పేల దువ్వెన‌తో దువ్వుకోవాలి. 

ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల పేల బాధ నుండి శాశ్వత ప‌రిష్కారం క‌లుగుతుంది.

అయితే సమస్యపై వైద్యులను సంప్రదించి..వారి సలహాలు తీసుకోవడం ఉత్తమం.

నోట్: ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో, అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాశాం. నెటిజన్స్ గమనించగలరు.