రాజకీయ నేతల్లో చాలా కొందరు మాత్రమే.. పార్టీలకు అతీతంగా అభిమానులను సంపాదించుకుంటారు.

ఈ కోవకు చెందిన నేతనే తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు.

రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉంటూ.. విపక్షాలపై విరుచుకుపడతారు.

అలానే సోషల్‌ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటారు హరీష్‌ రావు.

సోషల్‌ మీడియా వేదికగా మంచి చేసే వారిని అభినందించడం, సాయం కోరే వారికి, సమస్యలకు పరిష్కారం చూపడంలో ముందుంటారు.

తాజాగా తన కుమారుడిని ఉద్దేశిస్తూ.. హరీష్‌ రావు చేసిన ఓ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కుమారుడు గ్రాడ్యూయేషన్‌ డే సందర్భంగా తీసిన ఫొటోలను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు హరీష్‌ రావు.

హరీష్‌ రావు కుమారుడు అర్చిష్మాన్  అమెరికాలోని కొలరాడో యూనివర్సిటీలో ఇంజినీరింగ్ పూర్తి చేసి.. పట్టా అందుకున్నాడు.

ఈ మేరకు అమెరికాలోని కొలరాడో కౌంటీ బౌల్డర్‌లో యూనివర్సిటీ స్నాతకోత్సవం జరగింది.

హరీష్‌ రావు ఈ వేడుకలో పాల్గొనడం కోసం అమెరికా వెళ్లారు.

ఈ స్నాతకోత్సవ కార్యక్రమంలో అర్చిష్మాన్‌ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టాతో పాటు గ్లోబల్ ఎంగేజ్‌మెంట్ అవార్డు కూడా అందుకున్నాడు.

ఈ క్రమంలో ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు హరీష్ రావు.

తన కుమారుడిని చూసి గర్వపడుతున్నాను అంటూ ట్వీట్‌ చేశాడు.

ప్రస్తుతం హరీష్‌ రావు కొడుకు ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.