తెలుగు రాష్ట్రాల్లో జ్వరాలు,జలుబు,దగ్గు వంటి ఫ్లూ లక్షణాలతో ఎక్కువ మంది బాధపడుతున్నారు.
మామూలు జ్వరం, దగ్గు కొన్నిరోజులకు తగ్గిపోతుంది. కానీ ఇవి కొన్ని వారాల పాటు కొనసాగుతున్నాయి.
ఫ్లూ రోగులతో ఆసుపత్రులు కూడా కిటకిటలాడుతున్నాయి.
అయితే ఇది మామూలు రకం ఫ్లూ కాదని, H3N2 వైరస్ లక్షణాలని వైద్యులు చెబుతున్నారు.
H3N2 అని నిలువబడే ఇన్ల్ఫు ఎంజా వైరస్. ఇది శ్వాస కోశ సంబంధింత సమస్యలను ఏర్పరుస్తుంది.
దగ్గు, జ్వరం, వికారం, వాంతులు, గొంతు నొప్పి, కండరాలు, ఒళ్లు నొప్పులు, విరేచనాలు, విపరీతమైన తుమ్ములు, ముక్కు నుండి నీరుకారడం ఈ వైరస్ లక్షణాలు
దగ్గు, జలుబు ఉంటే ఐదు రోజుల పాటు వేచి చూడాలి. వీటికి జ్వరం, విరేచనాలు కూడా తోడైతే వైద్యుని దగ్గరికి వెళ్లాలి.
ఈ వైరస్ ఇతర కుటుంబ సభ్యులకు వ్యాపించే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించడం మంచిది.
ముఖ్యంగా చిన్నారులు, గర్భిణీలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఈ వైరస్ లక్షణాలు ఉంటే బయటకు వెళ్లరాదు. ఆఫీసులకు కూడా రెండు మూడు రోజుల పాటు సెలవు పెట్టి విశ్రాంతి తీసుకోవాలి
గోరు వెచ్చని నీటిని తీసుకోవాలి. రోజుకు కనీసం 3 లీటర్ల నీటిని తాగాలి. ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. మంచి ఆహార పదార్థాలు తినాలి.
తుమ్ము వచ్చినప్పుడు చేతులతో అడ్డు పెట్టుకోకుండా.. మాస్కులు వినియోగించాలి.
తరచూ చేతులనూ సబ్బుతో లేదా శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదు.
యాంటీ బయోటిక్స్ మాత్రం వైద్యుల సలహా మేరకు మాత్రమే వినియోగించాలి.
జ్వరం, ఒళ్లు నొప్పులుగా అనిపించినప్పుడు కేవలం పారాసెటామాల్ మాత్రమే వాడాలి.