సత్యదేవ్ సినిమాలంటే డిఫరెంట్ గా ఉంటాయని ప్రేక్షకుల్లో ఒక అభిప్రాయం ఉంది. 

సత్యదేవ్ సినిమాలంటే డిఫరెంట్ గా ఉంటాయని ప్రేక్షకుల్లో ఒక అభిప్రాయం ఉంది. 

సత్యదేవ్ చేసిన సినిమా అంటే ప్రత్యేకత ఏదో ఉండే ఉంటుందని అనుకుంటాం. ప్రేక్షకులకు గుర్తుండిపోయే సినిమాలే చేయడం సత్యదేవ్ ప్రత్యేకత.

మరి తమన్నాతో కలిసి జతకట్టిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గుర్తుందా శీతాకాలం సినిమా గుర్తుండిపోయే సినిమానా? కదా? అనేది రివ్యూలో చూద్దాం.  

కథ: సత్యదేవ్ (సత్యదేవ్) ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి. స్కూల్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ ఆ ప్రేమ అక్కడే వాడిపోతుంది. ఆ తర్వాత కాలేజ్ లైఫ్.

కాలేజ్ లో ధనవంతురాలి కూతురు అమ్ము అలియాస్ అమృతతో (కావ్యా శెట్టి) ప్రేమలో పడతాడు సత్యదేవ్.

అయితే సత్యదేవ్ ఒక కంపెనీలో ఉద్యోగంలో చేరతాడు. తనకొచ్చే జీతంతో ఇద్దరం కలిసి బతకడం కష్టమని తెలిసి అమ్ము సత్యదేవ్ ని వదిలేసి వెళ్ళిపోతుంది.

ఆ తర్వాత నిధి (తమన్నా) పరిచయమవుతుంది. ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతారు. ఈ క్రమంలో సత్యదేవ్ జీవితంలోకి మళ్ళీ అమ్ము వస్తుంది.

  కొంచెం కన్ఫ్యూజన్ తోనే సత్యదేవ్ నిధిని పెళ్లి చేసుకుంటాడు. అయితే ఆ తర్వాత అమ్ముపై ఫీలింగ్స్ ఏర్పడతాయి.

  అమ్ము కాకుండా దివ్య అనే మరో అమ్మాయి సత్యదేవ్ లైఫ్ లోకి వస్తుంది.

  దివ్యకి, దేవ్ కి సంబంధం ఏమిటి? సత్యదేవ్ కి ఎదురైన పరిణామాలు ఏమిటి? నిధిని కాదని సత్యదేవ్ అమ్ము కోసం ఆలోచిస్తాడా? లేదా ప్రాణంగా ప్రేమించి నిధి కోసం ఆలోచిస్తాడా?

  లైఫ్ ఇచ్చిన సెకండ్ ఛాన్స్ ని వినియోగించుకుంటాడా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

  విశ్లేషణ: ఇదొక ట్రైయాంగిల్ లవ్ స్టోరీ. ప్రతీ ఒక్కరి జీవితంలో ఒక్కో స్టేజ్ లో ఒక్కో లవ్ స్టోరీ ఉంటుంది. స్కూల్, కాలేజ్, కెరీర్ ఈ మూడు స్టేజెస్ లో ప్రతీ ఒక్కరికీ ప్రేమకథలు ఉంటాయి.  

ప్రేమ కథలని తలచుకుంటే మంచి ఫీలింగ్ కలుగుతుంది. లవ్ ఫెయిల్ అయ్యి.. వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్న తర్వాత మాజీ లవర్స్ మళ్ళీ జీవితాల్లోకి వస్తే కలిగే అనుభూతి వర్ణించలేనిది.  

అప్పుడు ఛాన్స్ ఇవ్వకుండా తప్పు చేశాను, ఇప్పుడు ఛాన్స్ ఇస్తే ఏం చేస్తావ్ అని అడిగితే .. పెళ్ళైన వ్యక్తిగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి?

అని సతమతమయ్యే పాత్రలో సత్యదేవ్ చాలా బాగా నటించారు.  

ఇక నిధి పాత్రలో తమన్నా, దివ్య పాత్రలో మేఘా ఆకాష్, అమ్ము పాత్రలో కావ్యా శెట్టి, సత్యదేవ్ స్నేహితుడిగా ప్రశాంత్ పాత్రలో ప్రియదర్శి చాలా బాగా నటించారు.

2020లో వచ్చిన కన్నడ మూవీ లవ్ మోక్ టైల్ సినిమాకి రీమేక్ గా రావడం, అది కూడా వాయిదాలు పడుతూ రెండేళ్ల తర్వాత రిలీజ్ కావడం వల్ల ఈ గ్యాప్ లో ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది.

సాంకేతిక పనితీరు విషయానికొస్తే.. నిర్మాణ విలువలు బాగున్నాయి. సత్య హెగ్డే సినిమాటోగ్రఫీ, కాలభైరవ సంగీతం, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ ఆకట్టుకుంటాయి.

ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీని దర్శకుడు తెరకెక్కించిన విధానం బాగుంది.  

ప్లస్ లు: సత్యదేవ్ నటన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ లు: ఆలస్యంగా రిలీజ్ అవ్వడం పాత కథలా అనిపించడం

చివరి మాట: లవ్ స్టోరీలని చూసే ప్రేక్షకులకి ఈ ‘గుర్తుందా శీతాకాలం’ బాగా గుర్తుండిపోతుంది     

రేటింగ్: 2/5