వేసవి కాలంలో కూల్ డ్రింక్ వినియోగం ఎక్కువగా జరుగుతుంది.

పాలు తాగే పసి వాళ్ల నుంచి పండు ముసలి వాళ్ల వరకు.. అందరూ కూల్ డ్రింక్స్ కి అలవాటు పడ్డారు.

అయితే ప్రస్తుతం కూల్‌డ్రింక్‌ కంపెనీలన్నింటిని ఓ చెట్టు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లు సమాచారం.

ఏం కూల్‌ డ్రింక్‌ అయినా తయారు కావాలంటే ప్రధానంగా వాడే పదార్థం గమ్‌ అరబిక్‌.

సాఫ్ట్‌ డ్రింక్స్‌ తయారీలో ఈ పదార్థం లేకపోతే చాలా కష్టం.

 సాఫ్ట్‌ డ్రింక్‌ తయారు చేసేందుకు వాడే పదార్థాలన్నింటిని ఈ గమ్‌ అరబిక్‌ కలిపి ఉంచుతుంది.

ఒకవేళ ఈ గమ్ అరబిక్ ను కలిపిన ఫలితంగా కూల్ డ్రింక్స్ రుచిని పొందుతాయి.

గమ్‌ అరబిక్‌ వాడకపోతే.. పదార్థాలన్ని విడిపోయి.. ఎలాంటి రుచి  ఉండదు.

దీన్ని బట్టి కూల్‌ డ్రింక్స్‌ తయారీలో గమ్‌ అరబిక్‌ ఎంత ముఖ్యమో అర్థం అవుతుంది.

అకాసియా అనే చెట్టు నుంచి వచ్చే ఒకలాంటి జిగురు పదార్ధమే ఈ గమ్ అరబిక్.

సుడాన్ దేశంలో మాత్రమే లభించడంతో అక్కడి నుంచే దిగుమతి చేసుకుంటాయి.

సూడాన్‌ అంతర్యుద్ధం కారణంగా గమ్‌ అరబిక్‌కు కొరత ఏర్పడుతుందని కూల్‌డ్రింక్‌ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

గమ్‌ అరబిక్‌ లేకుండా కూల్‌ డ్రింక్‌ కంపెనీలు తమ ఉనికికి కాపాడుకోవడం దాదాపు అసాధ్యమంట.

 ఫిజీ డ్రింక్స్‌ వంటి డ్రింక్స్ లో గమ్‌ అరబిక్‌కు ప్రత్యామ్నాయంగా మరొకటి లేదని నిపుణులు అంటున్నారు.

కూల్‌ డ్రింక్‌ కంపెనీలు ఐక్యరాజ్య సమితి వేదికపై తమ వాయిస్ ను వినిపిస్తున్నాయి.