ఏదైనా వస్తువు లేదా సేవ గురించి ప్రజలకు తెలియాలంటే ప్రచారం చాలా అవసరం.

ఎంత గట్టిగా ప్రచారం చేస్తే వాటి గురించి అంత ఎక్కువగా ప్రజలకు తెలుస్తుంది. తద్వారా సేల్స్‌ ఊపందుకుంటాయి.

అందుకే కంపెనీలు ఎక్కువగా సెలెబ్రిటీలతో బ్రాండ్‌ ప్రమోషన్లు చేపిస్తుంటాయి.

సినిమా, క్రీడా రంగాలకు చెందిన వారితో తమ వస్తు, సేవల గురించి ప్రచారం చేయిస్తూ ఉంటాయి.

సదరు సెలెబ్రిటీల కారణంగా వినియోగదారులు ఎక్కువగా ప్రభావితం అవుతుంటారు.

కొన్ని సార్లు సెలెబ్రిటీలను నమ్మి వస్తు, సేవలను వినియోగించి మోసపోతూ ఉంటారు.

ఇదే విషయమై కేంద్ర ప్రభుత్వం ఓ కీలక ప్రకటన చేసింది.

బ్రాండ్‌ ప్రమోషన్‌లపై సెలబ్రిటీలకు నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఈ మార్గ దర్శకాల ప్రకారం.. సెలెబ్రిటీలు ఏదైనా వస్తు, లేదా సేవలను ప్రమోట్‌ చేసే ముందు వాటిని తప్పకుండా వినియోగించాలి.

వాటి ద్వారా ఎదురైన అనుభవాలను తెలుపుతూ ప్రచారం చేయాలి.

ప్రచారం కూడా అందరికీ అర్థమయ్యే సాధారణ భాషలో ఉండాలి.

ఓ వస్తువులో లేని గుణాల గురించి చెప్పి ప్రచారం చేయటం నేరం.

 వీడియోలు లేదా ఫొటోల ద్వారా చేసే ప్రచారం స్పష్టంగా ఉండాలి.