‘పేదోడి యాపిల్ ’గా చెప్పుకునే జామపండు ఆకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి.

జామ ఆకు నమిలి తినడం ద్వారా పంటి నొప్పి, చిగుళ్ల నొప్పి, నోటిపూత లాంటి ఎన్నో సమస్యలు దూరం అవుతాయి.

జామ ఆకు రసం చేసుకొని తాగితే శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్​లో ఉంటాయి.  

 జామాకుతో టీ చేసుకొని తాగితే షుగర్ కి సంబంధించిన అన్ని రకాల సమస్యలు నుంచి బయటపడొచ్చు.

జామ ఆకులో డైటరీ ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో  జీర్ణశక్తి పెరుగుతుంది.

జామ ఆకులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు రక్తంలోని విషపదార్థాలను బయటకు పంపిస్తాయి. 

 ఈ ఆకులో ఉండే పొటాషియం, డైటరీ ఫైబర్ గుండెకు ఎంతో మేలు చేయడమే కాదు.. చెడు కొలస్ట్రాల్ తగ్గిస్తుంది.

జామ ఆకుల కషాయం హై బీపీని చక్కగా కంట్రోల్ లో ఉంచుతుంది. 

జామకాయల్లో కేలరీలు చాలా తక్కువగా.. శరీరానికి  విటమిన్లు, మినరల్సూ మేలు చేస్తాయి.

జామ ఆకుల్లో విటమిన్ సీ ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. దగ్గు, జ్వరం రాకుండా చూస్తుంది. 

తరుచూ జామ ఆకుల రసం తాగితే.. చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది.. స్కిన్ ఇన్ఫెక్షన్లు రాకుండా చూస్తుంది. 

 అజీర్తి, వాంతులు, విరేచనాలు అవుతుంటే.. జామ ఆకులతో చేసిన టీ తాగితే వెంటనే తగ్గిపోతాయి. 

జామ ఆకుల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.. ఇది మనకు ఇమ్యునిటీని పెంచుతుంది.