ధనియాలను మనము ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తాము. దీనికి కొత్తిమీర అని కూడా అంటారు.
అనేక చర్మ సమస్యలను తగ్గించడంలో ధనియాలు బాగా పనిచేస్తాయి.
ధనియాల్లో యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉంటాయి. అందువల్ల నోట్లో పుండ్లు, పొక్కులను తగ్గిస్తాయి.
ధనియాల్లో లినోలీయిక్ యాసిడ్ ఉంటుంది. ఇది నొప్పిని తగ్గిస్తుంది. నోటి అల్సర్లు కూడా తగ్గుతాయి
గజ్జి, చర్మంపై దురదలు, దద్దుర్లు, వాపులను తగ్గించడంలో ధనియాలు ఉపయోగపడతాయి.
ధనియాలను రోజూ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.
ధనియాల పొడిని రోజూ తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. వీటిల్లో యాంటీ హైపర్ గ్లైసీమిక్ లక్షణాలు ఉంటాయి.
శరీరం ఇన్సులిన్‌ను గ్రహించేలా చేస్తాయి. దీంతో షుగర్ తగ్గుతుంది. డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
ధనియాలను తీసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. జుట్టు బాగా పెరుగుతుంది. శిరోజాలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.
ధనియాల్లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇది లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది.
ధనియాల్లో ఉండే సమ్మేళనాలు జీర్ణశక్తిని పెంచుతాయి. గ్యాస్, అసిడిటీ సమస్యలను తగ్గిస్తాయి. ప్రేగులు మొత్తం శుభ్రమైపోతాయి.
ఇందులో , విటమిన్ ఎ, బీటా కెరోటిన్‌లతోపాటుఫోలిక్ యాసిడ్, విటమిన్ సి కూడా అధికంగానే ఉంటుంది. ఇది దగ్గు, జలుబు, ఫ్లూలను తగ్గిస్తుంది.
బియ్యం నీటిలో దాల్చిన చెక్క కలిపి అందులో కొంత ధనియాల పొడి వేసి పిల్లలకు ఇస్తే దగ్గు అలసట రెండు తగ్గిపోతాయి.
కొలెస్ట్రాల్ కంట్రలోల్ లో ఉండాలంటే 2 చెంచాల ధనియాల పొడిని ఒక గ్లాసు నీళ్లలో మరిగించి చల్లారిన తరువాత వడపోసుకొని తాగితే మంచి ప్రయోజనం.