గ్రాము బంగారం ప్రస్తుతం రూ. 6,115 ఉంది. పది గ్రాములు రూ. 61,150 ఉంది.

ఈ బంగారం ధర రానున్న రోజుల్లో రూ. లక్ష అవుతుందని లలితా జ్యువెలరీ ఎండీ కిరణ్ కుమార్ అంటున్నారు.

గ్రాము బంగారం కొనాలంటే రూ. 10 వేలు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందని అంటున్నారు.

గత కొన్ని రోజులుగా చూసుకుంటే బంగారం ధర పెరిగినా, తరిగినా రూ. 200 నుంచి రూ. 800 మధ్యలోనే ఉంటుంది.

బంగారం తగ్గితే 5, 10 శాతం తగ్గుతుంది. పెరిగితే 20 శాతం పెరుగుతుంది. గమనిస్తే బంగారం విషయంలో ఎప్పుడూ 10 శాతం పెరుగుదల అయితే కనబడుతోందని కిరణ్ కుమార్ అన్నారు.

కరోనా లాక్ డౌన్ సమయంలో కిలో బంగారం ధర రూ. 39 లక్షల నుంచి రూ. 40 లక్షలు మధ్య ఉండేదని, ఆ తర్వాత అది రూ. 69 లక్షలకు చేరుకుందని అన్నారు.

ఈరోజు కూడా కిలో బంగారం రూ. 67 లక్షల నుంచి 68 లక్షలు ఉందని, ఈ లెక్కన 20 శాతం పెరుగుదల కనబడుతోందని అన్నారు.

భవిష్యత్తులో అంటే దీర్ఘకాలంలో చూస్తే గ్రాము బంగారం ధర రూ. 10 వేలు అయిపోతుందని, 10 వేలు ఇస్తే గ్రాము బంగారం ఇచ్చే పరిస్థితి వస్తుందని, కిలో కోటి రూపాయలు అయిపోతుందని అన్నారు.

గడిచిన రెండు, మూడేళ్ళలో కిలో బంగారం రూ. 40 లక్షల నుంచి రూ. 60 లక్షలకు వచ్చేసింది. కోటి రూపాయలకు రూ. 40 లక్షలే దూరం ఉంది.

అది ఎంతో దూరంలో లేదు. బంగారం నెమ్మదిగా పెరుగుతుందని, నూరు శాతం పెరుగుతుందని, కాకపోతే సమయం పడుతుందని అన్నారు.

ఏడాది క్రితం స్వచ్ఛమైన బంగారం ధర రూ. 53 వేలు ఉంటే, ఆరు నెలల క్రితం రూ. 56 వేలు అయ్యింది.

3 నెలల క్రితం రూ. 58 వేలు ఉంటే, నెల రోజుల క్రితం అది రూ. 60 వేలు అయ్యింది.

ఒక్క ఏడాదిలో బంగారం విషయంలో దాదాపు 8 వేల రూపాయల నుంచి 10 వేల రూపాయలు పెరుగుదల కనబడింది.

ఈ లెక్కన రెండు, మూడేళ్ళలో 20 వేల నుంచి 30 వేల వ్యత్యాసం అనేది మనం చూసే అవకాశం కనబడుతోంది.

అప్పుడు 10 గ్రాముల బంగారం 90 వేల నుంచి లక్షకు చేరిపోతుంది. కిలో బంగారం కోటి రూపాయలు అయిపోతుంది.

కిరణ్ కుమార్ చెప్పినట్టు బంగారం విషయంలో ఈ భారీ పెరుగుదల కనబడడానికి రెండు, మూడేళ్లు పడుతుందో లేక ఇంకా తక్కువ సమయం పడుతుందో చూడాలి.