ఇంటర్ పాసైన వారికి గుడ్ న్యూస్. ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రిత్వ శాఖల్లో నాయస్థానాల్లో డేటా ఎంట్రీ జాబ్స్ ఉన్నాయి.

పలు మంత్రిత్వ శాఖలు, డిపార్టుమెంట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, రాజ్యాంగ సంస్థలు, చట్టబద్ధమైన సంస్థలు, న్యాయస్థానాల్లో 1600 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

లోయర్ డివిజనల్ క్లర్క్/జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పోస్టులకు సంబంధించి నియామకం చేపట్టనున్నారు.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గ్రూప్ సి పోస్టుల రిక్రూట్మెంట్ కి సంబంధించి సీజీఎల్ లెవల్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.    

లోయర్ డివిజన్ క్లర్క్/జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జీతం: రూ. 19,900 నుంచి రూ. 63,200 వరకూ

డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈఓ) జీతం: లెవల్ 4: రూ. 25,500 నుంచి రూ. 81,100 లెవల్ 5: రూ. 29,200 నుంచి రూ. 92,300 వరకూ

డేటా ఎంట్రీ ఆపరేటర్, గ్రేడ్ ‘ఏ’ జీతం: రూ. 25,500 నుంచి 81,100 వరకూ

వయసు పరిమితి: 01/08/2023 నాటికి 18 నుంచి 27 ఏళ్ల లోపు ఉండాలి.

అర్హతలు: డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్ కి గుర్తింపు పొందిన బోర్డు నుంచి సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్ట్స్ తో ఇంటర్ పూర్తి చేసి ఉండాలి లేదా తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

లోయర్ డివిజన్ క్లర్క్/జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జాబ్ కి ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి.

దరఖాస్తు వివరాలు: దరఖాస్తు రుసుము: రూ. 100/- స్త్రీలు, ఎక్స్ సర్వీస్ మెన్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు

దరఖాస్తు చివరి తేదీ: 08/06/2023

టైర్ 1 కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ: ఆగస్టు 2023 టైర్ 2 కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ: త్వరలో ప్రకటిస్తారు

పరీక్షా కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్ లోని చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్

పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://sumantv.com/telugu-news/jobs/govt-data-entry-jobs-with-inter-qualification-374678.html