ప్రముఖ వ్యాపారవేత్త, టెక్ దిగ్గజం, ఇంటెల్ సహ వ్యవస్థాపకుడు గోర్డన్ మూర్ (94) కన్నుమూశారు.

హవాయిలోని తన స్వగృహంలో శనివారం మూర్ తుదిశ్వాస విడిచారు. 

మూర్ మృతికి ఇంటెల్ సంస్థ నివాళులు అర్పించింది. ఆయన సేవలు చిరస్మరణీయం అంటూ కొనియాడింది. 

టెక్ ప్రపంచం ఓ గొప్ప విజనరీని కోల్పోయిందంటూ ఇంటెల్ కంపెనీ ట్వీట్ చేసింది. 

మూరే మృతికి వ్యాపార వర్గాలు కూడా నివాళులు అర్పించాయి. ఆయన దూరదృష్టి హైటెక్ యుగానికి వేదికైంది అంటూ కొనియాడాయి.

1950వ దశకంలో సెమీకండక్టర్ల వ్యాపారాన్ని మొదలుపెట్టారు మూర్.

అనంతరం ఆయన ఇంటెల్ కార్పొరేషన్ సంస్థను స్థాపించారు. ప్రతి ఏడాది కంప్యూటర్ ప్రాసెసింగ్ పవర్ పెరుగుతూ పోతుందని మూర్ ముందే ఊహించారు. 

కంప్యూటర్ ప్రాసెసర్ ఇండస్ట్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు గోర్డన్ మూర్. పీసీ రివల్యూషన్​లో ఆయన పోషించిన పాత్ర చాలా స్పెషల్ అనే చెప్పాలి. 

మెమొరీ చిప్స్ రూపకల్పనలోనూ మూర్ తన ముద్ర వేశారు. వ్యాపార విషయాలను పక్కనబెడితే.. దాతృత్వంలోనూ ఆయన ముందుండేవారు. 

భార్య బెట్టీతో కలసి మూర్ విస్తృతంగా దానాలు చేసేవారు. 2001లో వీరిద్దరూ కలసి బెట్టీ మూర్ ఫౌండేషన్​ను స్థాపించారు. 

ఈ ఫౌండేషన్​కు 175 మిలియన్ ఇంటెల్ షేర్లను విరాళంగా ఇచ్చారు మూర్. 

కంప్యూటర్ ప్రాసెసింగ్ పవర్స్ రెట్టింపు అవుతాయని ముందే ఊహించిన మూర్.. ఆ తర్వాత ప్రతి రెండేళ్లకు దాన్ని సవరించారు. 

ఇలా ప్రాసెసింగ్ పవర్స్​ను సవరించడాన్ని ‘మూర్స్ లా’ అని పిలుస్తారు.