శాఖాహారాలన్నింటిలోకి ఆకుపచ్చని బఠానీలలోనే పోషకాలు అధికంగా లభిస్తాయి.

ఈ బటానీలను తరచుగా తీసుకోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. 

ఆకు పచ్చని బఠానీలలో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. 150 గ్రాముల పచ్చిబఠానీలలో 78 కేలరీలు ఉంటాయి. 

పచ్చి బఠానీలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇవి రక్తపోటును తగ్గించడంతోపాటు గుండె సంబంధిత వ్యాధులను దూరం చేస్తాయి. 

ఆకు పచ్చని బఠానీలు బరువు తగ్గించడానికి బాగా సహాయపడతాయి. దీనిలో ఉండే మెగ్నీషియం ,యాంటీ ఆక్సిడెంట్లు ,కాల్షియం పొటాషియం వంటి పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి.

ఆకు పచ్చని బఠానీల్లో ఫైబర్స్ జీర్ణక్రియ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. 

పచ్చి బఠానీలలో ఉండే ఇనుము రక్తహీనత లోపాన్ని తగ్గిస్తుంది. 

శరీరానికి కావలసిన అంత ఇనుము లభించకపోతే ఆక్సిజన్ తీసుకువెళ్లే ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి చేయదు. దీంతో హిమోగ్లోబిన్ శాతం తగ్గుతుంది. - శరీరంలో ఐరన్ సరిపడ ఉంటే అలసట తగ్గుముఖం పడుతుంది. మనకు కావాల్సిన శక్తి కూడా లభిస్తుంది. 

ఈ బఠానీలు డయాబెటిస్ నుంచి వచ్చే ప్రమాదాన్ని అరికడతాయి. 

ఉబకాయ ప్రమాదాన్ని కూడా తగ్గించడానికి వీటిలో గ్లైసేమిక్ స్థాయిలను తక్కువగా ఉంచుతుంది. 

రక్తంలోనే షుగర్ స్థాయిలను తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. వీటిలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. 

రోగనిరోధక శక్తిని పెంచడంలో ముందుంటుంది. వివిధ రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది. 

 కంటి చూపుని మెరుగుపరుస్తుంది. ఆకు పచ్చని బటానీలలో కరగని ఫైబర్స్ ఉంటాయి.

 రక్త పోటు, గుండె జబ్బులు నివారణలో సహాయపడతాయి. 

పచ్చి బఠానీలు లో ఉండే ఔషధ గుణాలు రక్తంలోనే చక్కెర స్థాయిలను అదుపు చేస్తాయి.